భర్త గుండెపై వాలిన వనిత.. ఐ డోంట్ కేర్ అంటూ మూడో పెళ్లి వివాదంపై సంచలన పోస్ట్

వనితా విజయ్ కుమార్-పీటర్ పాల్ పెళ్లి తమిళ నాట ఎంతగా వివాదాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీటర్ తన భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడం, ఈ విషయంపై ఆమె మీడియా ముందుకు రావడం, ఈ ఘటనలో నిర్మాత రవీంద్రన్, సూర్య దేవీ, లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరీ శంకర్ వంటి వారు ఎంటరర్వడం మరింత సెన్సేషన్ అయింది.

చివరకు వనిత ఫిర్యాదుతో నిన్న అర్ధరాత్రి సూర్యా దేవిని అరెస్ట్ చేసే వరకు వెళ్లింది వ్యవహారం. ఆపై కస్తూరీ ఆమెను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిందనుకోండి. తాజాగా ఈ ఘటనలన్నింటిపై స్పందిస్తూ.. వివాదానికి ఇంతటితో పుల్ స్టాప్ పెడుతున్నానని వనితా ఓ సుధీర్ఘమైన పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే..

చట్టం తన పని..

చట్టం తన పని..

‘శ్రేయోభిలాషులకు, అభిమానులకు, మిత్రులకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. నేను సూర్యా దేవీపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. చట్టం తన పని తాను చేసుకునిపోయింది. చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కుతీసుకెళ్లారు.. ఆమె పిల్లలను బంధువులు జాగ్రత్తగా చూసుకున్నారు.

మానవత్వం లేకుండా..

మానవత్వం లేకుండా..

ఆడవారు అయినంత మాత్రానా, పిల్లలు ఉన్నంత మాత్రానా చేసిన తప్పు తప్పు కాకుండా పోదు.. శిక్షించకుండా వదిలేయ లేము. చట్టం ముందు అందరూ సమానమే. కనీస మానవత్వం లేకుండా ఆమె నన్ను కించపరిచింది. అయినా సరే..ఆమె పిల్లలు బాధపడుతున్నారని.. నేను ఆమెను రిమాండ్‌లో ఉంచమనలేదు. ప్రతీ విషయంలో పిల్లలే బాధితులు అవుతుంటారు.

ఇకపై ఏం మాట్లాడను..

ఇకపై ఏం మాట్లాడను..

ఆమె బెయిల్ తీసుకోవడంపై మేము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కొన్ని షరుతుల మీదు ఆమెను విడుదల చేశారు. ఆమె చేసిన నేరం మాత్రం ఇకపై కొనసాగించరాదు. మా విడాకులు విషయాన్ని మేము మా లాయర్లతోనే క్లియర్ చేసుకుంటాం. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడి మా సమయాన్ని వృథా చేసుకోదలుచుకోలేదు. ఇకపై ఈ టాపిక్ గురించి మీడియాతో మాట్లాడటం గానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయను.

ఎంతో విసిగిపోయాను..

ఎంతో విసిగిపోయాను..

ఈ విషయాన్ని వాడుకుని కొంత మంది లాభపడదామని అనుకుంటున్నారని నాకు తెలుసు. మా వద్ద నుంచి డబ్బులు కాజేద్దామని, మీడియాలో కనబడి ఫేమస్ అవుదామని కొందరు ఆలోచిస్తున్నారు. అదంతా సరే. కించపరచడం, ఓదార్చడం వంటివి చూసి చూసిచ ఇక నేను ఎంతో విసిగిపోయాను. అంతా ముగిసింది ఇక.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
ఐ డోంట్ కేర్..

ఐ డోంట్ కేర్..

ఎవరి ఎవరికైనా సాయం చేయండి.. ఎవరు ఎవరితోనైనా బతకనివ్వండి.. నేను పీటర్ మాత్రం ఏది పట్టించుకోం. మా నిజాయితీ, నిబద్దతను ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన పనే లేదు. మేము దేవుళ్లకు , మా అంతరాత్మకు మాత్రమే భయపడతాము. ఈ ఘటనతో సంబంధం లేని వారు ఎంత మొత్తుకున్నా ఇకపై నేను ఏది పట్టించుకోను. సైలెంట్‌గా ఉంటాను. చెవిటి వాళ్లలా మారిపోతాం. మా గురించి ఆలోచించిన, ప్రేమను పంచిన వారందరికీ ధన్యవాదాల'ని సుధీర్ఘమైన పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X