Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా జీవితం కాదు.. మీ లైఫ్‌ను చక్క దిద్దుకోండి.. ఆ ప్రముఖులపై వనితా విజయ్ కుమార్ ఫైర్
తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్ మరోసారి ఇటీవల వార్తల్లో నిలిచారు. ప్రేమించి మూడోసారి పెళ్లి చేసుకొన్న పీటర్ పాల్‌ను వదిలేయడంతో దక్షిణాది మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల కాలంలో వనితా విజయ్ కుమార్‌ను ఉద్దేశించి కొందరు టార్గెట్ చేయడంపై మండిపడ్డారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై మండిపడుతూ వరుస ట్వీట్లు చేశారు. ఆమె చేసిన ట్వీట్లలో...
ఎవరికి ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు
జీవితంలో తమ ఇష్టానుసారం జీవించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఒకరు ఎలా జీవించాలన్నది వారి ఇష్టప్రకారమే ఉండాలి. కానీ మరొకరి సలహాలు, సూచనల ప్రకారం కాదు. ఒకరి జీవితంలో వేలు పెట్టడానికి ముందు మీ జీవితాలను సరిదిద్దుకొండి అంటూ తనపై విమర్శలు చేస్తున్న కొందరిపై ఘాటుగా వనితా విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటా
నేను చాలా ధైర్యవంతురాలిని. నా జీవితానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా ఉంది. అందుకు చాలా మంది ప్రేమానురాగాలు, దీవెనలు నాకు ఉన్నాయి. వాటితోనే నేను చక్కగా ఉన్నాను. నాపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ వనితా విజయ్ కుమార్ తన ట్వీట్లో తెలిపారు.
సంతోషం, విషాదాలను పంచుకొంటా
నన్ను నన్నుగా ప్రేమించే వారికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నా జీవితంలో చోటుచేసుకొనే పరిణామాలను వారికి అప్డేట్ చేస్తుంటాను. నా జీవితానికి సంబంధించిన సంతోషకరమైన క్షణాలను, విషాదాలను వారితో పంచుకొంటాను అంటూ వనితా విజయ్ కుమార్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
Recommended Video
మైండ్ యువర్ బిజినెస్ అంటూ ఘాటుగా
ఇక నా జీవితంపై గాసిప్స్ ప్రచారం చేస్తూ, ఊహగానాలతో బతికే వారికి నేను ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే.. మీ పరిధిలో మీరు ఉండాలి. నా జీవితానికి సంబంధం లేని, అవాస్తవ విషయాలను డబ్బు తీసుకొని ప్రచారం చేయకండి. అసత్య వార్తలను మీడియాలో వదలకండి అంటూ వనితా విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.