వనిత విజయ్ కుమార్ ఎంత మంచిదో.. అలా అడగడంతో వెంటనే ఓకే అనేసింది!!

గత రెండు నెలలుగా వనిత విజయ్ కుమార్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఎంతో ఘనంగా చేసుకున్న మూడో పెళ్లి వివాదాలకు దారి తీసింది. పీటర్ పాల్ తన భార్య ఎలిజబెత్‌కు విడాకులు ఇవ్వకుండా.. వనితను పెళ్లి చేసుకోడంతో వివాదం మొదలైంది. ఈ మేరకు ఎలిజబెత్ చేసిన ఫిర్యాదుతో వనిత, పీటర్ పాల్ నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. వీరి గొడవలో సూర్యాదేవీ, నిర్మాత రవీంద్రన్, నటుడు నంజిల్ విజయన్, హీరోయిన్ కస్తూరీ శంకర్ వంటి వారు రావడంతో మరింత రచ్చగా తయారైంది వ్యవహారాం. అయితే ప్రస్తుతం వనిత వివాదాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఎన్నో వివాదాలు..

ఎన్నో వివాదాలు..

సూర్యాదేవీ, నిర్మాత రవీంద్రన్, నటుడు నంజిల్ విజయన్, హీరోయిన్ కస్తూరీ శంకర్, లక్ష్మీ రామకృష్ణన్ వంటి వారు వనితను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. యూట్యూబ్, మీడియా డిబెట్స్‌లో వనితను దారుణంగా ట్రోల్స్ చేశారు. వనిత కూడా వారికి ధీటుగానే కౌంటర్స్ వేసింది. ఇక ఈ కామెంట్స్ పర్సనల్ దాడికి దారి తీయడంతో పోలీసుల వరకు వెళ్లింది.

అరెస్ట్‌లు, బెయిల్‌లు..

అరెస్ట్‌లు, బెయిల్‌లు..


తనను దారుణంగా దూషిస్తున్నారని వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాదేవీని పోలీసులు అర్దరాత్రి అరెస్ట్ చేశారు. ఆపై కస్తూరీ శంకర్ బెయిల్ ఇచ్చి ఆమెను బయటకు తీసుకువచ్చింది. ఇలా అరెస్ట్ చేయడంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో వనిత కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక నుంచి ఎవరి పనులు వారు చూసుకుందామంటూ హిత బోధ చేసింది.

వివాదానికి ముగింపు..

వివాదానికి ముగింపు..

ఎవరు ఏదైనా అనుకోండి ఇకపై ఈ వివాదం గురించి నేను మాట్లాడను. మా మధ్య ఉన్న గొడవలను ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. మధ్యలో ఎవ్వరూ కలగజేసుకోవాల్సిన పని లేదు. మధ్యలో వేరే వాళ్లు రావడంతో అవి ఇంకా పెద్దవి అవుతాయి అని వనిత వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేసింది.

వాటికి దూరంగా..

వాటికి దూరంగా..

వివాదాలకు దూరంగా ఉంటోన్న వనిత యూట్యూబ్‌లో వంటల వీడియోలతో కాలక్షేపం చేస్తోంది. ఇక ఈ మధ్య తన భర్తకు బాగా లేకపోవడం, ఆస్పత్రిలో జాయిన్ అవ్వడంపై వనిత ఎమోషనల్ అయింది, అయితే ప్రస్తుతం పీటర్ క్షేమంగా ఉన్నాడు. తాజాగా ఓ నెటిజన్ అభ్యర్థనకు వనిత స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
ఫస్ట్ లుక్ అండ్ టైటిల్..

ఫస్ట్ లుక్ అండ్ టైటిల్..

మేము ఓ షార్ట్ ఫిలింను పూర్తి చేశాం. ప్రస్తుతం సమాజానికి అవసరమైన సోషల్ మెసెజ్‌తో కూడుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే మీ చేతుల మీదుగా రిలీజ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.. దయచేసి మాకు సాయం చేయండి అని ఓ నెటిజన్ వనితను కోరాడు. దీనికి వెంటనే స్పందించిన వనిత.. మీ వివరాలను పంపండి అని రిప్లై ఇచ్చింది. నిజంగా వనిత మనసు ఎంత మంచిదో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X