twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితమంటే ఏంటో నేర్పింది.. ఎప్పటికీ మరిచిపోలేను.. భర్త ఆరోగ్యంపై వనిత ఎమోషనల్

    |

    వనిత విజయ్‌కుమార్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల గురించి అందరికీ తెలిసిందే. వనిత పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకోవడం, అతనేమో తన భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా వివాహాం చేసుకోవడంతో అసలు రచ్చ మొదలైంది. ఇక వీరంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, మధ్యలోకి కొందరు రావడంతో అది చిలికి చిలికి వానగా మారింది. చివరకు అరెస్ట్‌ల వరకు చేరింది.

    మధ్యలో ఎంట్రీ..

    మధ్యలో ఎంట్రీ..

    వనిత-ఎలిజబెత్ వివాదంలో సూర్యాదేవీ, నిర్మాత రవీంద్రన్, నటుడు నంజిల్ విజయన్, హీరోయిన్ కస్తూరీ శంకర్, లక్ష్మీ రామకృష్ణన్ వంటి వారు ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా డిబెట్స్‌లో వనితను అందరూ దారుణంగా ట్రోల్స్ చేశారు. వనిత కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఓ స్థాయి వరకు వీటిని భరించిన వనిత.. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    సూర్యాదేవీ అరెస్ట్..

    సూర్యాదేవీ అరెస్ట్..

    సోషల్ మీడియాలో, మీడియాలో తనను వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, మానసికంగా కృంగిపోయేలా కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సూర్యాదేవీని అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన ఎంతగానే సెన్సేషనల్ అయింది. తన పిల్లలను అలాగే వదిలేశారని, అర్దరాత్రి అలా ఎలా అరెస్ట్ చేస్తారంటూ సూర్యాదేవీ ఫైర్ అయింది. ఆపై కస్తూరీ శంకర్ బెయిల్ ఇచ్చి ఆమెను బయటకు తీసుకువచ్చింది.

    ఎవరి పని వారు..

    ఎవరి పని వారు..

    ఇలా ఆరోపణలు చేసుకుంటూ వెళ్లే గొడవలు జరుగుతూనే ఉంటాయని, తమ మధ్య ఉన్న గొడవలు ఎలా పరిష్కరించుకోవాలనే తమకు తెలుసని వనిత పేర్కొంది. తమకెవరి మధ్య వర్తిత్వం అవసరం లేదని తెలిపింది. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని హితవు పలికింది.

    అనారోగ్యంతో భర్త..

    అనారోగ్యంతో భర్త..

    వనిత భర్త పీటర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ మధ్య భర్త ఆరోగ్యంపై తెగ ఎమోషనల్ అయింది. ఆ దేవుడు ఉన్నాడని, తనకు అంతా మంచే చేస్తాడని, భారమంతా దేవుడి మీదే వేశానని అప్పుడు ఎంతో బాధ పడింది. తాజాగా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో పూజ చేసింది.

    Recommended Video

    Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
    ఎంతో నేర్పింది..

    ఎంతో నేర్పింది..

    లక్ష్మీ కుబేరుని పూజా చేశాం.. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం. 2020లో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. అవి కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడికి కొన్ని ప్లాన్స్ ఉంటాయి.. నేను వాటినే గుడ్డిగా ఫాలో అవుతున్నాను. దేవుడిపై నాకున్న నమ్మకమే నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తోంది. జీవితం అంటే ఏంటో, దేవుడి శక్తి ఏంటో ఈ ఏడాది నాకు చూపించింది.. ఎప్పటికీ మరిచిపోలేను అంటూ వనిత ఎమోషనల్ అయింది.

    English summary
    Vanitha Vijaykumar Done Lakshmi kuberan pooja at home, Hospital to back home in 2020 is a miracle by itself..only god can do it..he has a plan and I am going with it blindly ...my faith and goodness will take care of me and my family...a year never to forgotten..teaching us life and the power of god
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X