అది ఇప్పుడే తెలిసింది.. ప్రతీదానికి ఓ కారణం ఉంటుంది.. వేదాంత ధోరణిలో వనితా విజయ్ కుమార్!!

వనితా విజయ్ కుమార్ గతకొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సన్సేషన్ అయింది. వనిత మూడో పెళ్లి చేసుకోవడం రాష్ట్ర స్థాయి సమస్య లెవెల్లో సంచలనం సృష్టించింది. వనిత పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అయితే పీటర్ తన మొదటి భార్య ఎలిజబెత్‌కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడంతో అసలు సమస్య మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఫిర్యాదులు, కేసులు, అరెస్ట్‌లు, బెదిరింపులు ఇలా నానా రచ్చ జరిగింది.

భర్తపై ఫిర్యాదు..

భర్తపై ఫిర్యాదు..

పీటర్ పాల్ తనను మోసం చేశాడని, తనకు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకున్నాడని ఎలిజబెత్ ఫిర్యాదు చేసింది. ఇక అక్కడి వాదోపవాదాలు, ఆరోపణలు జరుగుతూనే వచ్చాయి. డబ్బు కావాలనే ఉద్దేశ్యంతో బ్లాక్ మెయిల్ చేస్తోందని వనిత తిరిగి ఆరోపణలు చేసింది. ఈ వివాదంలోకి మధ్యలో కొందరు సెలెబ్రిటీలు ఎంట్రి ఇచ్చారు.

వారి ఎంట్రీతో..

వారి ఎంట్రీతో..

వనిత-పీటర్ పాల్-ఎలిజబెత్ వివాదంపై డిబెట్లు, సోషల్ మీడియాలో చర్చలు, టీవీల్లో గంటల తరబడి చర్చలు జరిగేవి. వీటిలో భాగంగా సూర్యాదేవీ, కస్తూరీ శంకర్, నంజిల్ విజయన్, నిర్మాత రవీంద్రన్, లక్ష్మీ రామకృష్ణన్ వంటి వారు స్పందించారు. వీరంతా ఎలిజబెత్ వైపు నిలిచారు.

అరెస్ట్ వరకు..

అరెస్ట్ వరకు..

ఇక వీరంతా తనను ఘోరంగా అవమానిస్తున్నారని, ఆరోపణలు చేస్తున్నారని వనిత ఫిర్యాదు చేసింది. వనిత ఫిర్యాదులో సూర్యాదేవీని అర్దరాత్రి అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆ తరువాత ఆమెను కస్తూరీ బయటకు తీసుకురావడం, మళ్లీ ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటూ రావడం జరుగుతూనే ఉంది.

 కొన్ని రోజులుగా సైలెంట్...

కొన్ని రోజులుగా సైలెంట్...

ఇదంతా తమ కుటుంబానికి చెందిన సమస్య అని, తామే పరిష్కరించుకోగలమని ఎవరి మధ్య వర్తిత్త్వం అవసరం లేదని వనిత చెప్పుకొచ్చింది. ఇక నుంచి ఎవ్వరు ఏం మాట్లాడినా తాను స్పందించబోనని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగట్టు కనిపించినా.. అప్పుడప్పుడు మాత్రం పరోక్షంగా కొన్ని సెటైర్స్ వేస్తూ ఉంటుంది.

ఇప్పుడే తెలిసింది..

ఇప్పుడే తెలిసింది..

ఈ ప్రపంచం విభిన్న మనస్తత్వాలతో కూడుకున్న మనుషులతో నిండి ఉంది.. ఈ ప్రపంచంలో దయాగుణం కంటే ద్వేషం కలిగిన వారే ఎక్కువగా ఉన్నారని ఆలస్యంగా తెలుసుకున్నాను అని వనిత చెప్పుకొచ్చింది. మరో ట్వీట్‌లో.. చెప్పడానికి ఎంతో ఉంది.. నేనేమీ చేయలేను.. దేవుడు గొప్పవాడు.. నమ్మండి.. ఏం జరిగినా దానికీ ఓ కారణం కచ్చితంగా ఉంటుంది.. జీవితం అంటే కష్టతరంతో కూడుకున్నది.. దాన్ని ఎదుర్కోవాల్సిందే.. నమ్మకంతో ఏదైనా చేయండి.. అంతా బాగానే జరుగుతుంది.. కష్టాలను ఎదుర్కోండి.. హిట్ బ్యాక్.. ఈ ప్రపంచానికి మీరేంటో చూపించండి అని వనిత వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X