‘అత్తారింటికి దారేది’ రీమేక్.. తమిళ ట్రైలర్ చూశారా?

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అత్తారింటికి దారేది' తెలుగులో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈచిత్రాన్ని శింబు హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో 'వంత రాజవంతాన్‌ వరువేన్‌' పేరుతో రీమేక్ చేశారు.

తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమిళ నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

పవన్ కళ్యాణ్ పాత్రలో శింబు నటించగా... తెలుగులో అత్త పాత్ర పోషించిన నదియా స్థానంలో రమ్యకృష్ణ , సమంత పాత్రను మేఘా ఆకాష్, ప్రణీత పాత్రలో కేథరిన్ నటించారు. ఆదివారం సాయంత్రం ట్రైలర్ విడుదలవ్వగా ఇప్పటికే 1.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

Vantha Rajavathaan Varuven movie Trailer released

ట్రైలర్ చూస్తుంటే... కొన్ని సీన్లు మినహా దాదాపు తెలుగు వెర్షన్ నుంచి చాలా సీన్లు మక్కికి మక్కి దించినట్లు తెలుస్తోంది 'చివరి పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్పా' అనే డైలాగ్ సైతం శింబు చెప్పడం గమనార్హం. ఫిబ్రవరి 1న ఈ చిత్రం థియేటర్లలోకి కాబోతోంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X