ఇంట్లో వాళ్లకి కరోనా వచ్చినప్పుడే ఆ భయం తెలుస్తుంది.. వరలక్ష్మీ శరత్ కుమార్ పోస్ట్ వైరల్

ప్రస్తుతం కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా పెరుగుతూనే ఉన్నాయి. సెలెబ్రిటీలు సైతం ప్రస్తుతం వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యే శరత్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలిసింది. హైద్రాబాద్‌లో షూటింగ్ కోసం వచ్చిన శరత్ కుమార్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హైద్రాబాద్‌లోనే శరత్ కుమార్ చికిత్స తీసుకున్నాడు.

రాధిక, వరలక్ష్మీ ట్వీట్స్..

రాధిక, వరలక్ష్మీ ట్వీట్స్..


శరత్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో రాధిక, వరలక్ష్మీలు సోషల్ మీడియాలో స్పందిస్తూ... ఆ విషయాన్ని ప్రకటించారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉండగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు.

డిశ్చార్జి అయ్యాడు..

డిశ్చార్జి అయ్యాడు..

తాజాగా వరలక్ష్మీ తన తండ్రి శరత్ కుమార్ హెల్త్ అప్డేట్ ఇచ్చింది. తాజాగా శరత్ కుమార్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడట. అయితే ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని తెలిపింది. ఈ మేరకు దాదాపు పది రోజులు క్వారంటైన్‌లో ఉంటారని పేర్కొంది.

Recommended Video

Varalakshmi Sarathkumar Made Hot Comments On Prabhas | FilmiBeat elugu
వైద్య బృంధానికి ధన్యవాదాలు..

వైద్య బృంధానికి ధన్యవాదాలు..

శరత్ కుమార్‌ను జాగ్రత్తగా చూసుకుని, అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు వరలక్ష్మీ ధన్యవాదాలు తెలిపింది. వారి వల్ల ఇంత త్వరగా కోలుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే ఆయన ఇంకా పూర్తిగా కోలుకోవాలంటే మరో 15 రోజులు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉందని, నాన్న కోసం ప్రార్ఠించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.

మన వాళ్లకు వస్తేనే..

మన వాళ్లకు వస్తేనే..

ఇది కేవలం కరోనా హెచ్చరిక మాత్రమే. మనం ఇంకా జాగ్రత్తలు పాటించకపోతే మరింత ప్రమాదాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కరోనా వైరస్ ఎంత డేంజర్ అన్నది.. మన ఫ్యామిలీ మెంబర్స్‌కు కరోనా వచ్చినప్పుడే తెలుస్తుంది..దయచేసి మాస్క్‌లు ధరించండి.. అవసరమైతేనే బయటకు వెళ్లండి.. భౌతిక దూరం పాటించండని వరలక్ష్మీ కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X