twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్లు, చెవులు, నోరు అన్నీ మూసుకోండి.. ముందడుగు వేసిన వరలక్ష్మీ శరత్ కుమార్!

    |

    కరోనా వైరస్, లాక్ డౌన్ కాలంలో కొన్ని సర్వేలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ లాక్ డౌన్ కాలంలో మహిళలపై గృహ హింస పెరిగిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. అసలే సమాజంలో జరిగే అన్యాయాలపై వరలక్ష్మీ స్పందిస్తూ ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటుంది. అదే విధంగా ఇప్పుడు మహిళల కష్టాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ముందడుగు వేసింది.

    లాక్ డౌన్‌లో హల్చల్..

    లాక్ డౌన్‌లో హల్చల్..

    లాక్ డౌన్ కాలంలో వరలక్ష్మీ హల్చల్ చేసింది. ఉపాధి లేక రోడ్డున పడ్డ వారికి సాయం చేసింది. అందరినీ సాయం చేయమని కోరింది. మరీ ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంది. వారిని కాపాడండి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని కోరంది.

    వాటిపై ఆగ్రహం..

    వాటిపై ఆగ్రహం..

    ఇక తమిళనాడులో జరిగిన జయప్రియ ఘనట, ఫినిక్స్ ఘటనపై వరలక్ష్మీ గొంతెత్తింది. తమిళ నాడు పోలీస్ డిపార్ట్మెంట్‌పై కోలీవుడ్ కన్నెర్ర చేసింది. తాజాగా వరలక్ష్మీ మహిళలపై జరిగే హింసపై గొంతెత్తింది. అంతేకాకుండా తనలానే అందరూ ఓ ఫోటో తీసి, హ్యాష్ ట్యాగ్‌లతో పోస్ట్ చేయమని కోరింది.

     గృహహింస పెరిగింది..

    గృహహింస పెరిగింది..

    ఈ లాక్ డౌన్ కాలంలో మహిళలపై గృహహింస పెరగడం ఈ ప్రపంచం కూడా చూసింది. ఇది రోజురోజుకీ శృతిమించిపోతోంది. దీనిపై మౌనంగా ఉండటం ఆప్షన్ కాదు. మనమంతా ముందుకు రావాలి.. మద్దతు తెలపాలి.. అందరికీ అవగాహన కల్పించాలి.. బాధితురాళ్లను కాపాడాలి. ప్రస్తుతం మనం అంతా కలిసి ఓ రిపోర్ట్ బయటకు తీయాలి.. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలంటే.. 181 లేదా జాతీయ మహిళా కమిషన్ నంబర్ 7217735372కు వాట్సప్ చేయాలని వరలక్ష్మీ కోరింది.

    Recommended Video

    Nadigar Sangam Election 2019 : Bharathi Raja controversial comments On Vishal || Filmibeat Telugu
    ఫోటోలు, హ్యాష్ ట్యాగ్‌లు..

    ఫోటోలు, హ్యాష్ ట్యాగ్‌లు..

    #ActAgainstAbuse ఉద్యమంలో పాల్గోనేందుకు, మద్దతు తెలిపేందుకు నోరు, కళ్లు, చెవులు మూసుకుని ఉన్న ఫోటోను ఈ హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయండి. అందరూ ఏకం కండి... ఇదే సరైన సమయం అంటూ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం వరలక్ష్మీ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Varalakshmi Sarathkumar About Act Against Abuse, Tragically, the world has witnessed a sharp rise in domestic violence cases during the lockdown..It's getting worse by the minute and staying mum is not an option.. We have to come together to express our support, create awareness, and help abuse victims.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X