ఐలవ్యూ చెప్పాలనుకుంటే ప్రభాస్‌కే చెబుతా.. ఫైర్ బ్రాండ్ హీరోయిన్ హాట్ కామెంట్స్!

Recommended Video

Varalakshmi Sarathkumar Made Hot Comments On Prabhas | FilmiBeat elugu

హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ తమిళనాట దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే వరలక్ష్మి తమిళ చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది విజయ్ చిత్రం సర్కార్ లో వరలక్ష్మి పోషించిన ప్రతి నాయిక పాత్ర హైలైట్ గా నిలిచింది. ఎలాంటి విషయం గురించి అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వరలక్ష్మి శరత్ కుమార్ శైలి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ భామ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి హాట్ కామెంట్స్ చేసింది.

 హీరోయిన్ పాత్రల కోసం

హీరోయిన్ పాత్రల కోసం

చాలా మంది నటీమణులు అవకాశాలు రాకున్నా హీరోయిన్ పాత్రల కోసమే ఎదురుచూస్తూ సమయం వృధా చేసుకుంటారు. కానీ వరలక్ష్మి అలా కాదు. నెగిటివ్ రోల్ అయినా సరే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటిగా తానేంటో నిరూపించుకుంది. అదే తరహాలో వరలక్ష్మిని విభిన్నమైన పత్రాలు వరిస్తున్నాయి. వరలక్ష్మి చుట్టూ అనేక రూమర్స్ కూడా ఉన్నాయి.

 ఎట్టకేలకు ఫుల్‌స్టాప్

ఎట్టకేలకు ఫుల్‌స్టాప్

హీరో విశాల్ కు, వరలక్ష్మికి మధ్య ఘాటు ఎఫైర్ సాగుతోందని చాలా వార్తలు వినిపించాయి. వీరిద్దరూ పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. విశాల్, వరలక్ష్మి ఇద్దరూ ఈ వార్తలని ఖండించినా రూమర్స్ మాత్రం ఆగలేదు. కానీ ఇటీవల విశాల్ తాను హైదరాబాద్ యువతి అనీషాని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఈ రూమర్స్ కు ఫుల్‌స్టాప్ పడ్డట్లైంది.

ప్రభాస్‌కే చెబుతా

ప్రభాస్‌కే చెబుతా

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రభాస్ పై హాట్ కామెంట్స్ చేసింది. తనకు బాహుబలి నటుడు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ఎవరికైనా ఐలవ్యూ చెప్పాల్సి వస్తే మాత్రం అది ప్రభాస్‌కే చెబుతా అంటూ కామెంట్ చేసింది. ఇప్పటికే ప్రభాస్ విషయంలో అనేక రూమర్స్ కొనసాగుతున్నాయి. తాజాగా వరలక్ష్మి ఈ తరహా కామెంట్స్ చేసి కొత్త అలజడిని సృష్టించింది. ఎలాంటి విషయం గురించి అయినా బోల్డ్ గా మాట్లాడి వార్తల్లో నిలవడం వరలక్ష్మికి అలవాటే.

తెలుగులో తొలి చిత్రం

తెలుగులో తొలి చిత్రం

ఈ ఏడాది వరలక్ష్మి శరత్ కుమార్ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. గత ఏడాది వరలక్ష్మి మిస్టర్ చంద్రమౌళి, సర్కార్, మారి2 చిత్రాల్లో నటించింది. తెలుగులో సందీప్ కిషన్ నటిస్తున్న తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. వరలక్ష్మి నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X