వేశ్య పాత్రలో మరో ముద్దుగుమ్మ
చెన్నై : వేశ్య పాత్రలో నటించటానికి హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. తాజాగా 'పోడా పోడీ' ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి వరలక్ష్మి. 'సుప్రీంస్టార్' శరత్‌కుమార్ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ అమ్మడు.. దుమ్మురేపే డాన్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత నృత్యానికి సంబంధించిన కథలకే ఈ ముద్దుగుమ్మ ఓకే చెబుతోంది. విశాల్ సరసన ఆమె నటించిన రెండో చిత్రం 'ఎంజీఆర్' ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.
మరోవైపు భిన్న చిత్రాలతో ఆకట్టుకునే దర్శకుడు బాలా... వరలక్ష్మి ప్రతిభకు తగ్గట్టు తన 'తార తప్పటై'లో అవకాశమిచ్చారు. ఇందులో ఆమె 'కరగాట్టం' కళాకారిణిగా నటిస్తోంది. ప్రథమార్థంలో నృత్య కళాకారిణిగా... ద్వితీయార్థంలో వేశ్య పాత్రలో నటిస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రారంభంలో ఈ పాత్రపై అనాసక్తి చూపించినా.. తన సీనియర్ నటీమణులను దృష్టిలో ఉంచుకుని సరేనందట అమ్మడు.

సినిమాలో ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో నటించాక.. తన కెరీర్‌పై నమ్మకం పలు రెట్లు పెరిగిందని సన్నిహిత వర్గాలతో ఆమె పేర్కొందట. తన చిత్రాలతో జాతీయ అవార్డుల అంశంలో ముందు వరుసలో ఉంటే బాలా.. ఈ సారి కూడా ఈ చిత్రం ద్వారా పురస్కారాలను అందుకుంటారని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











