ముద్దు ఇవ్వాల్సి వస్తే అతడికే.. చంపాలని అనిపిస్తే.. ఆ హీరోలపై వరలక్ష్మి శరత్ కుమార్!
తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కు డేరింగ్ నటిగా పేరుంది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరలక్ష్మి శరత్ కుమార్ రాణిస్తోంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేకత. ఇటీవల వరలక్ష్మి సర్కార్ చిత్రంలో పోషించిన విలన్ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సర్కార్ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ ఓ అవార్డుల వేడుకలో పాల్గొంది. ఆ వేదికపై వరలక్ష్మి విశాల్, శింబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆసక్తికర ప్రశ్న
సినిమా అవార్డుల ఫంక్షన్స్ చాలా సరదాగా జరుగుతుంటాయి. అలాగే ఈ వేడుకలో కూడా యాంకర్ వరలక్ష్మిని ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. ముద్దు ఇవ్వాల్సి వస్తే, ఒకరిని చంపాల్సి వస్తే, ఒకరిని వివాహం చేసుకోవాల్సి వస్తే ఈ మూడు అంశాలలో మీ ఛాయిస్ ఎవరు అని యాంకర్ వరలక్ష్మిని ప్రశ్నించింది.ముగ్గురి పేర్లు చెప్పాలని కోరింది. ఈ ప్రశ్నకు వరలక్ష్మి ఏమాత్రం మొహమాట పడకుండా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

ముద్దు మాత్రం అతడికే
తాను ముద్దు ఇవ్వాల్సి వస్తే హీరో శింబుకి మాత్రమే ఇస్తానని వరలక్ష్మి శరత్ కుమార్ స్పష్టం చేసింది. ఇక చంపాలని అనిపించినంత కోపం వచ్చినప్పుడు మాత్రం విశాల్ నే టార్గెట్ చేస్తానని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. ఇక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు మాత్రం తాను ఇప్పుడే చెప్పనని వరలక్ష్మి తెలిపింది. ప్రస్తుతం వరలక్ష్మి చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది.

విశాల్‌తో ఎఫైర్
చాలా రోజులుగా విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలని అటు విశాల్, ఇటు వరలక్ష్మి ఇద్దరూ ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులం అని తెలిపారు. విశాల్ పందెం కోడి 2 చిత్రంలో కూడా వరలక్ష్మి ప్రతినాయకగా నటించింది.

శింబు చిత్రంతో
శింబు సరసన పోడాపోడి చిత్రంలో వరలక్ష్మి హీరోయిన్ గా నటించింది. ఇదే వరలక్ష్మికి డెబ్యూ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం వరలక్ష్మి ధనుష్ మారి 2 చిత్రంలో నటిస్తోంది. ఈ నెల 21 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో గ్లామర్ పాత్రలకు తాను సిద్దమే అని, కాని కేవలం గ్లామర్ కోసమే సినిమా అంటే మాత్రం ఒప్పుకోనని ఇటీవల వరలక్ష్మి తెలిపింది.


Click it and Unblock the Notifications











