Varalaxmi Sarathkumar: బికినిలో జయమ్మ ఇలా ఉంటుందా.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!
వరలక్ష్మి శరత్ కుమార్ అంటే తెలుగులో అంతగా ఎవరో గుర్తు పట్టకపోవచ్చు కానీ జయమ్మ అంటే మాత్రం చాలా తొందరగా ప్రేక్షకుల మైండ్ లో ఆమె బొమ్మ కనిపిస్తుంది. రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన జయమ్మ పాత్రకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో చాలా బిజీగా మారిపోయింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ మరో కోణంలో మంచి గ్లామర్ బ్యూటీ కూడా. ఇక రీసెంట్ గా ఆమె బికినీలో దర్శనం ఇచ్చిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్ లో ఈ కోణం కూడా ఉందా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి ఆమె హాట్ స్టిల్స్ పై ఒక లుక్కేస్తే..

భిన్నమైన నటన
వరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీలైనంత వరకు వరలక్ష్మీ క్యారెక్టర్ మేజర్ ప్లస్ పాయింట్ అనేలా ఉంటుంది. ఇక నటన విషయంలో అయితే ఏమాత్రం పొరపాటు లేకుండా చాలా పవర్ ఫుల్ గా నటించడంలో వరలక్ష్మి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాలి.

జయమ్మ క్యారెక్టర్
తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులో కూడా గత కొంతకాలంగా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బిజీగా కనిపిస్తోంది. రవితేజ గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాలో రవితేజ అలాగే ఇతర క్యారెక్టర్లు ఎలాగైతే క్లిక్ అయ్యాయో వరలక్ష్మి కూడా అదే తరహాలో మంచి గుర్తింపు అందుకుంది. ఆమె చేసిన జయమ్మ క్యారెక్టర్ ప్రేక్షకులు ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోలేరు అనే చెప్పాలి.

తెలుగు వారికి దగ్గరగా..
వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో ఎలాంటి సినిమా చేసినా కూడా ఆమెను ప్రేక్షకుల్లో జయమ్మ అనే భావనతోనే చూస్తున్నారు. బయట ఎక్కడ కనిపించినా కూడా జయమ్మ అంటూ ఆమెకు జేజేలు కొడుతున్నారు. ఒక విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలా బాగా కనెక్ట్ అయింది అని చెప్పాలి. తనకు తెలుగులోనే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అని కూడా చెప్పింది.

పవర్ఫుల్ విలన్ గా..
సీనియర్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ మొదట హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో రానిస్తోంది. కేవలం పాజిటివ్ సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగిటివ్ గా ఉండే పవర్ఫుల్ విలన్స్ పాత్రలలో కూడా కనిపిస్తుంది. ఆ మధ్య అల్లరి నరేష్ సినిమాలో నాంది అనే సినిమాలో లాయర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

బికినీలో వరలక్ష్మి
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ కోణం ఇంకా బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తోంది. అందులో వరలక్ష్మి శరత్ కుమార్ బికినీలో కనిపించి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.
Recommended Video

పుట్టినరోజు అలా.. మాల్దీవ్స్ లో..
ఇప్పటివరకు చీరలో నార్మల్ డ్రెస్ లలో కనిపించిన జయమ్మ హఠాత్తుగా అలా తెల్లని బికినీలో కనిపించే సరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మాల్దీవ్స్ లో ఇటీవల పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన వరలక్ష్మి అక్కడ బికినీలో కొన్ని ఫోటోలు దిగింది. ఇక వాటిని ఒక వీడియో లో హైలెట్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











