twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవసరమైతే పులిలా గర్జిస్తుంది.. చివరి క్షణం వరకు.. వరలక్ష్మీ ఎమోషనల్ పోస్ట్

    |

    కోలీవుడ్ ఫైర్ బ్రాండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. మొదటగా డబ్బింగ్ చిత్రాలతో పరిచయమైనా.. తెలుగులోనూ నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. విలనిజం పండించడంలో వరలక్ష్మీకే సాటి ఎవ్వరూ లేరని నిరూపించుకుంది. కేవలం తెరపైనా కాదు.. నిజ జీవితంలోనూ వరలక్ష్మీ ఓ ఫైర్ బ్రాండ్. మాటల తూటాలు వదిలితే ప్రత్యర్థలు ఖతమ్ కావాల్సిందే. అప్పట్లో విశాల్‌తో ప్రేమ వ్యవహారం నడిపిందనే గాసిప్స్ వచ్చినా.. ప్రస్తుతం ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం అది వేరే విషయం అనుకోండి. మాతృదినోత్సవం సందర్భంగా తన అమ్మ ఛాయాదేవీని తలుచుకుని ఎమోషనల్ అయింది.

    శరత్ కుమార్ మాజీ భార్య..

    శరత్ కుమార్ మాజీ భార్య..

    హీరో శరత్ కుమార్ మాజీ భార్య ఛాయా దేవీయే వరలక్ష్మీకి కన్నతల్లి అన్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో ఛాయాదేవీకి విడాకులు ఇచ్చి రాధికను రెండో వివాహామాడాడు శరత్. అయితే వరలక్ష్మీ మాత్రం రాధికను అమ్మ అని పిలవనని, ఆంటీ అనే సంబోధిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా తన అమ్మను తలుచుకుని కాస్త ఎమోషనల్ అయింది.

    ఆమె నా ధైర్యం..

    ఆమె నా ధైర్యం..

    మాతృదినోత్సవం సందర్భంగా వరలక్ష్మీ అమ్మను గుర్తు చేసుకుంది. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. ‘మీరు ఇంత ధైర్యంగా ఉండటానికి గల కారణమేంటని అందరూ నన్ను అడుగుతూనే ఉంటారు .. దానికి సమాధానం ఇక్కడే ఉంది.. నా ప్రేరణ .. నా బలం .. ఆమె మమ్మల్ని ఒంటి చేత్తో పెంచింది.

     పులిలా గర్జించేది..

    పులిలా గర్జించేది..

    మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది..ఆమెకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి, జంతువులకు సహాయం చేయగలిగింది .. మమ్మల్ని రక్షించే విషయానికి వస్తే పులిలా గర్జించింది. .ఆమె ప్రేమకు హద్దులు లేవు .. ఆమెకు విరామం లభించదు..

    సూపర్ మహిళ..

    సూపర్ మహిళ..

    ఏది సరైనది, ఏది తప్పు అనేది నేర్పింది .. వారెంతటి వారైనా సరే.. తప్పు చేస్తే అది తప్పే అని చెప్పేది.. ఆమె నా తల్లి నా సూపర్ మహిళ .. నిజాయితీగా చెబుతున్నా.. ఆమెకు బలం ఎక్కడి నుంచి వస్తుందో కొన్ని కొన్నిసార్లు నాక్కూడా తెలియదు .. ఈ రోజు వరకు ఏదైనా ఆమె చెప్పేది అది మ్యాజిక్‌లా జరుగుతుంది..

     చివరి క్షణం వరకు..

    చివరి క్షణం వరకు..

    నీవు నాలో మాత్రమే కాదు.. నీకు తెలిసిన, నిన్ను ప్రేమించిన వారెందరిలోనో స్ఫూర్తిని నింపావు. నా సర్వస్వం నువ్వే.. లవ్యూ అమ్మ.. నువ్ మా కోసం చేసిన వాటికి ఏమిచ్చినా ఆ రుణం తీరిపోదు.. కాని నా చివరి క్షణం వరకు నువ్ నవ్వుతూ ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తాను.. లవ్ యు మమ్మీ' అంటూ పోస్ట్ చేసింది.

    English summary
    Varalaxmi Sarathkumar emotional On Mother's Day ABout Chaya Devi. Everybody keeps asking me how are you so brave..?? Well here’s the answer my inspiration.. my rock.. she raised us girls single handedly.. sacrificed her life for us.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X