సమయం చూసి రాజకీయాల్లోకి వస్తా.. వరలక్ష్మి శరత్ కుమార్!
హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ తమిళనాట దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే వరలక్ష్మి తమిళ చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది విజయ్ చిత్రం సర్కార్ లో వరలక్ష్మి పోషించిన ప్రతి నాయిక పాత్ర హైలైట్ గా నిలిచింది. ఎలాంటి విషయం గురించి అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వరలక్ష్మి శరత్ కుమార్ శైలి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ.. రాజకీయ రంగప్రవేశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను రాజకీయాలపై అవగాహనా పెంచుకుంటున్నట్లు తెలిపింది. రాజకీయాలపై పూర్తి పరిజ్ఞానం వచ్చాక సమయం చూసి రాజకీయాల్లోకి వస్తానని తెలిపింది. రాజకీయాలు అంటే చాలా మందికి చెడు అభిప్రాయం ఉంటుంది. అది సరైనది కాదని వరలక్ష్మి తెలిపింది. రాజకీయాలు చెడ్డవేం కాదు. ప్రజలకు సేవ చేసే మంచి వేదిక అని వరలక్ష్మి తెలిపింది.

రాజకీయాల్లో విప్లవం రావాల్సిన అవసరం ఉంది. సామజిక మాధ్యమాలని ఉపయోగించుకుంటూ మహిళలు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. తన తండ్రి నడుపుతున్న ఏఐఎస్ఎంకె పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











