twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి ఏర్పాట్లు.. ఎంఎస్ ధోని ఫ్రెండ్‌తో వివాహం! ఆ క్రికెటర్ ఎవరంటే?

    |

    దక్షిణాదిలో సినీ తారల పెళ్లి వార్తలు అభిమానుల ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే నిఖిల్ పెళ్లి తంతు పూర్తవ్వగా.. రానా దగ్గుబాటి, నితిన్ రెడ్డి అదే దారిలో ఉన్నారు. అయితే వీరి పెళ్లి విషయంపై ఓ పక్క విపరీతమైన చర్చ జరుగుతుంటే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి వార్త మీడియాలో దూసుకొచ్చింది. ఆమె పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతా సవ్యంగా జరిగితే వరలక్ష్మి పెళ్లి లాక్'డౌన్ తర్వాత జరిగే ఛాన్స్ లేకపోలేదు. వివరాల్లోకి వెళితే..

    గతంలో విశాల్‌తో అఫైర్

    గతంలో విశాల్‌తో అఫైర్

    గతంలో వరలక్ష్మీ, నటుడు విశాల్ మధ్య అఫైర్, డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాను నడిగర సంఘం భవన నిర్మాణం జరిగేంత వరకు పెళ్లి చేసుకోనని విశాల్ శపథం చేయడంతో పెళ్లి కాస్తా ఆలస్యమైంది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ.. మా మధ్య అలాంటి బంధమే లేదు అని వరలక్ష్మీ క్లారిటీ ఇచ్చేసింది.

    విశాల్‌తో బ్రేకప్ తర్వాత

    విశాల్‌తో బ్రేకప్ తర్వాత

    ఇక వరలక్ష్మీ, విశాల్ బ్రేకప్ వార్త ఓ పక్క నానుతుండగానే మరో పక్క విశాల్ తన పెళ్లి న్యూస్‌తో దక్షిణాది మీడియాలో బాంబు పేల్చారు. అర్జున్ రెడ్డిలో నటించిన అనిషా ఆళ్ల రెడ్డి అనే వర్థమాన నటిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత విశాల్, అనిశా పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగింది. దాంతో వారిద్దరి మధ్య అఫైర్‌కు పుల్‌స్టాప్ పడింది.

    క్రికెట్ రంగానికి సంబంధించి వ్యక్తితో

    క్రికెట్ రంగానికి సంబంధించి వ్యక్తితో

    అయితే గత కొద్ది రోజులుగా సింగిల్ స్టేటస్‌ను మెయింటెన్ చేస్తున్న వరలక్ష్మీ ఇటీవల ప్రేమలో పడిందనే వార్త తమిళ మీడియాలో కనిపించింది. అయితే తన ప్రియుడు భారతీయ క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తి అనే విషయం చూచాయగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ పేరును మాత్రం చాలా పకడ్బందీగా బయటకు రాకుండా వరలక్ష్మి కుటుంబ సభ్యులు చర్యలు తీసుకొన్నారు.

    వరలక్ష్మి ప్రేమకు పెద్దల అంగీకారం

    వరలక్ష్మి ప్రేమకు పెద్దల అంగీకారం

    ఇదిలా ఉండగా తన బాయ్‌ఫ్రెండ్‌తో వరలక్ష్మీ పీకల్లోతు ప్రేమలో పడటం, ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. తమ ప్రేమ ప్రతిపాదనకు ఇరు కుటుంబాల నుంచి వీరిద్దరి ప్రేమకు ఆమోదం లభించినట్టు సమాచారం. అయితే వరలక్ష్మీకి కాబోయే భర్త క్రికెటర్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీకి అత్యంత స్నేహితుడనే విషయం బయటకు వచ్చింది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం చాలా సీక్రెట్‌గా పెట్టడం అనేక సందేహాలకు తావిస్తుంది.

    లాక్‌డౌన్ తర్వాత వర పెళ్లి

    లాక్‌డౌన్ తర్వాత వర పెళ్లి

    వరలక్ష్మి పెళ్లి గురించి ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే కరోనావైరస్ లాక్‌డౌన్ విధించడంతో ఆ చర్చలు అలాగే కొనసాగాయన తెలిసింది. అయితే గత రెండు నెలల్లో ఇరు కుటుంబాలు మధ్య అవగాహన కలిగి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకొన్నారని, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది.

    Recommended Video

    Radhika Sarathkumar Slapped Actor Sudhakar, Here's why
    వరలక్ష్మి పెళ్లి వార్తపై స్పందన

    వరలక్ష్మి పెళ్లి వార్తపై స్పందన

    ఇలాంటి వార్తలపై వరలక్ష్మీ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఆమె సన్నిహితులు మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. వరలక్ష్మికి ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉంది. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని చెప్పుకొచ్చారు. అయితే వరలక్ష్మి పెళ్లి విషయంపై చర్చలు మాత్రం చాలా సీరియస్‌గానే సాగుతున్నాయనేది తాజా సమాచారం.

    English summary
    Varalaxmi Sarathkumar marriage news goes viral in the media. As per reports, She is going to marry with close associates of Indian Cricker MS Dhoni, Virat Kohli. But Varalaxmi Sarathkumar cicles condemns the news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X