తమిళంలో టాలెంట్‌కు గుర్తింపులేదు.. టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితి.. వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో విభిన్నమైన పాత్రలు, విలక్షణ నటనతో దూసుకెళ్తున్నారు. గతంలో హీరోయిన్ పాత్రలు వేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకొని ఆమె నటనపరంగా రూట్ మార్చారు. పందెంకోడి2 సినిమాలో విలన్ టచ్ ఉన్న పాత్రలో కనిపించిన తర్వాత క్రాక్ సినిమాలోని జయమ్మ రోల్ ఆమె కెరీర్‌నే మార్చేయడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అయితే తెలుగులో బ్రహ్మండమైన ఆఫర్లతో దూసుకెళ్తున్న వరలక్ష్మీ తాజాగా తమిళ సినిమా పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

క్రాక్ నుంచి వీరసింహరెడ్డి వరకు

క్రాక్ నుంచి వీరసింహరెడ్డి వరకు

వరలక్ష్మీ శరత్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్, క్రాక్, నాంది చిత్రాల్లో నటించడమే కాకుండా సినిమాకు అత్యంత బలంగా మారిన పాత్రలో కనిపించింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత యశోద సినిమాలో విలన్ టచ్ ఉన్న పాత్రలో మెప్పించింది. వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణతో పోటాపోటీగా నటించింది.

తమిళంలో కొండ్రాల్ పావమ్

తమిళంలో కొండ్రాల్ పావమ్

ప్రస్తుతం తమిళంలో దయాళ్ పద్మనాభన్ దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న చిత్రం కొండ్రాల్ పావమ్. ఈ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మీ మాట్లాడుతూ.. నేను ఈ సినిమాలో మల్లిక అనే పాత్రలో నటించాను. ఒక ఇంటిలో ఒక రోజులో జరిగే సంఘటనలతో 1980 నాటి బ్యాక్ డ్రాప్‌తో థ్రిల్లర్‌గా రూపొందింది అని చెప్పారు.

క్రాక్ సినిమా తర్వాత

క్రాక్ సినిమా తర్వాత

తమిళ సినిమా పరిశ్రమలో 2012లో నా కెరీర్‌ పోడా పోడి సినిమాతో ప్రారంభమైంది. 2012 వరకు తమిళ పరిశ్రమలో నా ప్రతిభకు, టాలెంట్‌కు గుర్తింపు రాలేదు తెలుగు సినిమా పరిశ్రమలో 2022 క్రాక్ రిలీజైంది. క్రాక్ సినిమాలో నా పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి.

ఆ సినిమాలో నటనను తెలుగు సినిమా గుర్తించింది. మంచి పాత్రలతో నాకు బెస్ట్ కెరీర్‌ను ఇచ్చింది. నా రెమ్యునరేషన్ విషయంలో బేరం ఆడరు. కేవలం తెలుగు పరిశ్రమ టాలెంట్‌ను మాత్రమే ప్రోత్సాహిస్తుంది. నేను సినిమాలో ఉంటే ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకొంటారు అని వరలక్ష్మీచెప్పారు.

కొండ్రాల్ పావై సినిమా తర్వాత

కొండ్రాల్ పావై సినిమా తర్వాత

కొండ్రాల్ పావై సినిమా తర్వాత తెలుగు పరిశ్రమలో వచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం తమిళ సినిమా పరిశ్రమలో కూడా వస్తుందని అనుకొంటున్నాను. ఇదే టీమ్‌తో మరో సినిమాలో నటిస్తున్నాను. అది కూడా త్వరలోనే రిలీజ్ కానున్నది. నేను ప్రతీ సినిమాలో విలన్ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నప్పటికీ చాలా విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాను.

 వరలక్ష్మీ కామెంట్లపై రియాక్షన్ ఎలా ఉందంటే?

వరలక్ష్మీ కామెంట్లపై రియాక్షన్ ఎలా ఉందంటే?

తమిళ పరిశ్రమపై వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తున్నది. తెలుగు ప్రేక్షకులు ఆమె వ్యాఖ్యలను సమర్ధిస్తుండగా.. తమిళ ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నారు. అయితే కొందరు తమిళ ప్రేక్షకులు ఆమెకు మద్దతిస్తూ.. మంచి పాత్రలు చేయాలని కోరుకొంటున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ముక్కుసూటితనంతో చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X