ఆమె మా నాన్నకు భార్య మాత్రమే.. నాకు అమ్మకాదు: స్టార్ హీరో కూతురు సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో కుండబద్దలు కొట్టినట్లుగా ఆమె మాట్లాడే మాటలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఆమె తన తండ్రి శరత్ కుమార్ రెండో భార్య, సినీ నటి రాధిక గురించి స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

లేడీ ఓరియెంటెడ్ మూవీ..

లేడీ ఓరియెంటెడ్ మూవీ..

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం ‘వెల్వెట్ నగరం' అనే లేడీ ఓరియెంటెడ్ తమిళ సినిమాలో నటిస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రాధికతో తన రిలేషన్ గురించి వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది.

ఎన్నోరకాల పుకార్లు పుట్టిస్తున్నారు.. ఆమె ఆంటీనే..

ఎన్నోరకాల పుకార్లు పుట్టిస్తున్నారు.. ఆమె ఆంటీనే..

''బయట జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాధిక నా తల్లి అని అంటున్నారు. ఆమె నా తల్లి కాదు. నా తండ్రికి రెండో భార్య మాత్రమే. ఈ విషయంలో మేమంతా సంతోషంగానే ఉన్నాం. కానీ.. బయట మాత్రం రాధికకు నాకు పడదని, ఆమె నా తల్లి అని ఎన్నోరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. మా ఇద్దరి మధ్య మంచి రాపో ఉంది. నేను ఆమెను ఆంటీ అనే పిలుస్తాను'' అని చెప్పింది వరలక్ష్మి శరత్ కుమార్.

 ఎప్పటికీ అమ్మ కాలేదు..

ఎప్పటికీ అమ్మ కాలేదు..

తన తండ్రి శరత్ కుమార్ రాధికను పెళ్లిచేసుకున్నా, ఆమె తనకు ఎప్పటికీ అమ్మ కాలేదని స్పష్టం చేసింది వరలక్ష్మి. ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారిని, కాబట్టి మా నాన్న రెండో పెళ్లి చేసుకున్న రాధికను నేను ఆంటీ అని మాత్రమే సంబోధిస్తానని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది. అలాగే రాధికకు ఇచ్చే గౌరవాన్ని కూడా ఇస్తానని చెప్పుకొచ్చింది.

లైంగిక వేధింపులు.. హాట్ ఇష్యూ

లైంగిక వేధింపులు.. హాట్ ఇష్యూ

ఇకపోతే నటిగా కంటే వివాదాలతోనే పాపులర్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవలే కాస్టింగ్ కౌచ్ పై మరోసారి స్పందించి సినీ వర్గాల్లో ఆ అంశాన్ని హాట్ ఇష్యూ చేసేసింది. తన తండ్రి హీరో అని తెలిసి కూడా తనను కూడా కొందరు సినీ ప్రముఖులు లైంగికంగా వేధించారని ఆమె చెప్పింది.

Recommended Video

Varalakshmi Sarathkumar Made Hot Comments On Prabhas | FilmiBeat elugu
వరలక్ష్మి శరత్ కుమార్.. క్రాక్

వరలక్ష్మి శరత్ కుమార్.. క్రాక్

ఇకపోతే ఓ వైపు నటిస్తూనే తోటి నటుడు విశాల్‌తో వరలక్ష్మి శరత్ కుమార్ నడిపిన ప్రేమాయణం తమిళ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాల్‌తో ప్రేమాయణం ఆమె పాపులారిటీని మరింత పెంచేసింది. ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా రూపొందుతున్న ‘క్రాక్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X