నా తండ్రి హీరో అని తెలిసి కూడా లైంగిక వాంఛ తీర్చమనేవారు: హీరోయిన్ సంచలన కామెంట్స్
సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ స్పందించారు. వ్యక్తిగతంగా తమకు లైంగిక వేధింపులు ఎదురైయ్యాని బాహాటంగా చెప్పారు. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటి ఉద్యమాలు తెరపైకి వచ్చాక చాలామంది హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలపై ఆరోపణలు గుప్పించారు. కాగా తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి పోతే..

‘మీటూ' ఉద్యమం.. వరలక్ష్మి సపోర్ట్
లైంగిక దాడులకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ‘మీటూ' ఉద్యమానికి గతంలో సపోర్ట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. సినీ ఇండస్ట్రీలో మహిళా నటులపై లైంగిక వేధింపులు ఉన్న మాట వాస్తవమే అని చెబుతూ ‘మీటూ' ఉద్యమంపై తన స్పందన తెలియకేసింది.

ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు..
ఇకపోతే మళ్ళీ ఇప్పుడు.. పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన ఆమె సంచలన కామెంట్స్ చేసింది. కోలీవుడ్ చిత్రసీమలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పింది వరలక్ష్మి శరత్ కుమార్.

ధైర్యంగా లైంగిక వాంఛ తీర్చమని అడిగేవారు.. ఆ కారణంగా
తాను ఓ హీరో కూతురినని, తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదీ అని, తన తండ్రి శరత్‌కుమార్ హోదా గురించి తెలిసి కూడా ధైర్యంగా లైంగిక వాంఛ తీర్చమని అడిగేవారని వరలక్ష్మి పేర్కొంది. కాకపోతే అలాంటి వాటికి తానెప్పుడూ లొంగలేదని, ఆ కారణంగానే తన కెరీర్ ఆలస్యంగా మొదలైందని ఆమె చెప్పుకొచ్చింది.

కెరీర్‌లో ఎదగడం కోసం ఆ దారి..
ఇకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు ఇలాంటివి ఎదురవ్వడం సహజమే అని, అయితే వాటిని తిరస్కరించడమే గాక.. ధైర్యంగా బయటికి వచ్చి ఫిర్యాదు చేయాలని వరలక్ష్మి చెప్పడం విశేషం. అయితే ఇండస్ట్రీలో కేవలం అవకాశాల కోసం, కెరీర్‌లో ఎదగడం కోసం ఆ దారినే ఎంచుకునే వాళ్లను మనం ప్రశ్నించలేమని, నిజానికి అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలని ఆమె తెలిపింది.
Recommended Video


రవితేజ క్రాక్.. వరలక్ష్మి శరత్ కుమార్
కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారికి తానిచ్చే సలహా ఒక్కటే అని, తనలా సరైన అవకాశం వచ్చేంత వరకు వేచి చూడండని, అవకాశం ఖచ్చితంగా వస్తుందని, ఆ అవకాశం రాగానే మీ ప్రతిభను నిరూపించుకోండని వరలక్ష్మి తెలిపింది. తమిళ సీఎంఎమ్మెల్యేతో బిజీగా ఉన్న ఆమె ప్రస్తుతం.. తెలుగులో రవితేజ హీరోగా రూపొందుతున్న ‘క్రాక్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











