'ఆ విషయాలు బయటమాట్లాడుకుందాం రా'.. టీవీ యాంకరే పిలిచాడు.. వరలక్ష్మి సంచలనం!

కేవలం హీరోయిన్ల పాత్ర కోసమే ఎదురుచూడకుండా, అన్ని అవకాశాలని అందిపుచ్చుకుంటూ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దూసుకుపోతోంది. శరత్ కుమార్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి హద్దులు దాటే అందాల ఆరబోతకు దూరం. అయినా కూడా వరలక్ష్మి తమిళంలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల వరలక్ష్మి నటించిన సర్కార్ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరలక్ష్మి ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటీమణులపై వేధింపులు, సినిమాల్లో హీరోయిన్ పాత్రల గురించి వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అందరూ చేసేపని చేస్తే ఏం లాభం

అందరూ చేసేపని చేస్తే ఏం లాభం

ఇటీవల ప్రతి నాయక పాత్రల్లో ఎక్కువగా నటిస్తుండడంపై వరలక్ష్మి స్పందించింది. అందరూ నడిచే దారిలో గ్లామర్ పాత్రలో చేస్తే ఉపయోగం ఏముంటుంది. నా ప్రత్యేకత నిరూపించుకోవడానికే విలన్ రోల్స్ కూడా చేస్తున్నా. హీరోయిన్ పాత్రల కోసమే ఎదురుచూస్తూ కూర్చొను. నాకు గుర్తింపు దక్కే హీరోయిన్ పాత్ర వస్తే అందులో నటించడానికి సిద్ధం అని వరలక్ష్మి తెలిపింది.

ఎలాంటి అభ్యంతరం లేదు

ఎలాంటి అభ్యంతరం లేదు

తెరమీద గ్లామర్ షోకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చీరలో కూడా అందాలుగా, సెక్సీగా కనిపించవచ్చు. హద్దులు దాటే అందాల ప్రదర్శన అయితే మాత్రం ఒప్పుకోను అని తేల్చేసింది. ఇక హీరోయిన్లు నాజూకుగా ఉండాలనే నిబంధన లేదు. పాతతరం హీరోయిన్లు ఎవరూ నాజూకుగా లేరు. కానీ వారంతా వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన వాళ్లే కదా అంటూ వరలక్ష్మి బదులిచ్చింది. పాత్ర డిమాండ్ మేరకు బరువు తగ్గాల్సి వస్తే తప్పకుండా తగ్గుతాను అని వరలక్ష్మి తెలిపింది.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ ఈ నీచమైన పద్ధతి పాత రోజుల నుంచే కొనసాగుతున్నట్లు ఉంది. అప్పట్లో నటీమణులు అడగడానికి భయపడడం వలనే ఇప్పుడు ఇంతలా పాతుకుపోయింది. ప్రతుతం ఉన్న నటీమణులకు ధైర్యం ఎక్కువ. అందుకే కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి మీటూ ఉద్యమం ద్వారా నిలదీస్తున్నారని వరలక్ష్మి పేర్కొంది.

టీవీ యాంకరే అడిగాడు

టీవీ యాంకరే అడిగాడు

స్టార్ హీరో కుమార్తె అయిన మీకు ఎలాంటి వేధింపులు ఎదురయ్యాయా అనే ప్రశ్నకు వరలక్ష్మి సంచలన సమాధానం ఇచ్చింది. ఎప్పుడో ఎందుకు.. కొన్నిరోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఓ టివి ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ఇంటర్వ్యూ పూర్తయ్యాక.. మిగిలిన విషయాలు బయటకు వెళ్లి మాట్లాడుకుందాం రా అంటూ ఆ టివి యాంకరే పిలిచాడు అని వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. మిగిలిన విషయాలు అంటే ఏమిటో అందరికి తెలుసు అని వరలక్ష్మి పేర్కొంది.

అందరికి చెప్పా

అందరికి చెప్పా

ఓ నటితో టివి యాంకర్ కు బయటకు వెళ్లి మాట్లాడే విషయాలు ఏముంటాయి. అతడేమైనా నా కుటుంబ సభ్యుడా అని నిలదీసినట్లు వరలక్ష్మి పేర్కొంది. ఒక స్టార్ కుమార్తె అయినా నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన నటీమణులు ఎంతగా వేధింపులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు అని వరలక్ష్మి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X