ఇలాంటి చెత్త ప్రశ్నలు వేయొద్దు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైర్!.. పెళ్లిపై క్లారిటీ!
తమిళ, తెలుగు సినీ రంగాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ విలక్షణమైన నటిగా పేరు తెచ్చుకొన్న వరలక్ష్మీ శరత్ కుమార్ సీరియస్ అయ్యారు. చెన్నైలో తాను పాల్గొన్న ఓ ప్రెస్‌మీట్‌లో సమయం, సందర్భం లేకుండా అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి అసలు కారణమేమిటంటే...
ముదురు భామ అందాలు మాములుగా లేవు: మాల్దీవుల్లో బాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

క్రాక్, నాంది చిత్రాలతో
సినీ రంగంలో బ్రహ్మండమైన బ్యాకప్ ఉన్నప్పటికీ తనకంటూ ఓ స్థానాన్ని, ఇమేజ్‌తో నిలబడిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. లాక్‌డౌన్ తర్వాత అద్బుతమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. తెలుగులో క్రాక్, నాంది చిత్రాల్లోని ఆమె పోషించిన పాత్రలకు మంచి పేరు లభించింది.

విశాల్‌తో పెళ్లి అంటూ
అలాగే రెండు సంవత్సరాల క్రితం వరకు వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి విషయం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విశాల్‌తో అఫైర్ విషయం హైలెట్ అయింది. అయితే ఎందుకో కానీ.. విశాల్‌కు దూరంగా ఉండటం, బ్రేకప్ జరిగిందనే విషయం మీడియాలో వచ్చింది. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు.

చెన్నైలో ప్రెస్ మీట్‌లో
తాజాగా చెన్నైలో ప్రముఖ పిల్లల హాస్పిటల్ నిర్వహించిన ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో తన తల్లి సాయాతో కలిసి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రారంభించారు. ప్రెస్ మీట్ ఆరంభంలోనే 'మీ పెళ్లి ఎప్పుడు' అంటూ అడిగిన ప్రశ్నకు ఆమె సీరియస్ అయ్యారు. మీరు ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి ప్రశ్నను అడుగుతున్నారు అంటూ ఘాటుగా స్పందించారు.

మహిళలను అడిగే ప్రశ్న ఇదేనా
మీరు మహిళలతో ప్రవర్తించే తీరు ఇదేనా? ఇలాంటి చెత్త ప్రశ్నలను అడిగే సందర్భం ఇది అవునా? అంటూ జర్నలిస్టును నిలదీశారు. గొప్ప కార్యక్రమంలో ఇలాంటి ప్రశ్నలు అడగడం సరికాదు. నా పెళ్లి గురించి అడిగే వేదికలు వేరే ఉంటాయి అక్కడే అడగండి అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ సమాధానం ఇచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ కెరీర్
వరలక్ష్మీ శరత్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. పంబన్, ఛేజింగ్, పిరంథల్ పరాశక్తి, కలర్స్, యానై లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా తెలుగులో పలు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని ప్రాజెక్టులు అధికారికంగా వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











