పెళ్లి చేసుకుని రోజు ఒక్కడి మొహమే చూడాలా? దాంట్లో అర్థం లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు వరలక్ష్మీ శరత్​ కుమార్​. సీనియర్​ హీరో, నటుడు శరత్ కుమార్​ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ మొదట హీరోయిన్ గా అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ తర్వాత ఆర్టిస్ట్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయింది. అందుకే ఆమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే చేసిన క్రాక్ సినిమాతో జయమ్మగా తెలుగు ప్రజల నోట నానిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటి.

అలా నో సక్సెస్:సీనియర్​ నటుడు శరత్​ కుమార్ కుమార్తెగా సినీ రంగంలో కాలు మోపిన వరలక్ష్మీ శరత్ కుమార్​ హీరోయిన్​గా అనుకున్నంత సక్సెస్​ కాలేకపోయింది. పోడాపోడీ సినిమాతో కేరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ విశాల్, శింబు వంటి తదితర మీడియం రేంజ్ హీరోలతో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత పెద్దగా సక్సెస్ కాలేదు.

Varalaxmi Sarathkumar Shocking Comments On Marriage In An Interview

లేడీ విలన్ గా:హీరోయిన్​గా విజయం సాధించకపోయినప్పటికీ కూడా వరలక్ష్మి మంచి నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. హీరోయిన్ గా కాకుండా లేడీ విలన్​గా కొన్ని సినిమాల్లో ఊహించినంత రేంజ్​లో రెస్పాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఇళయదళపతి విజయ్ నటించిన సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకృష్ణ బీఎల్, క్రాక్ చిత్రాల్లో విలన్ గా ఆకట్టుకుని ఆశ్చర్యపరిచింది.

Varalaxmi Sarathkumar Shocking Comments On Marriage In An Interview

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ కు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. నాంది, పక్కా కమర్షియల్​, యశోద, వీర సింహారెడ్డి, కస్టడీ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం 'శబరి', 'వర ఐపీఎస్', 'హను-మాన్', 'పంబన్', 'కలర్స్', 'లగామ్', 'పిరంతల్ పరాశక్తి' వంటి తదితర చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే 'కొండ్రాల్ పావమ్' అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Varalaxmi Sarathkumar Shocking Comments On Marriage In An Interview

రాజకీయాలే లక్ష్యం:అయితే ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై చాలా భిన్నంగా స్పందించింది వరలక్ష్మీ శరత్ కుమార్. "అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి. పెళ్లి చేసుకుని రోజు ఒక్కడి మొహమే చూస్తూ ఉండాలి. రాజకీయాల్లోకి రావాలనేది నా లక్ష్యం. ఇక ప్రేమ లేని పెళ్లిలో అర్థం లేదు. ప్రేమించకుండా పెళ్లి చేసుకోలేను" అని షాకింగ్ కామెంట్స్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar Shocking Comments On Marriage In An Interview

ఆడవాళ్లకే ఎందుకు:వరలక్ష్మీ సమాధానానికి షాక్ అయిన యాంకర్ మీరు చాలా పెద్ద స్టేట్ మెంట్ పాస్ చేశారని అన్నారు. దానికి "ఎవరి బలవంతం మీద ఒక వ్యక్తి జీవితాంతం కలిసి ఉండలేరు. ప్రేమించి జీవితాంతం ఆ వ్యక్తితో ఉండాలి అని నిర్ణయించుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. సల్మాన్ ఖాన్ లాంటి హీరోను పెళ్లెప్పుడు చేసుకుంటారు అని ఎవరైనా ప్రశ్నించగలరా. ఆడవాళ్లకే ఎందుకు ఇన్ని ప్రశ్నలు" అని వరలక్ష్మీ క్వశ్చన్ చేసింది.

Varalaxmi Sarathkumar Shocking Comments On Marriage In An Interview

ఆ అవసరం లేదు:"ఆడవాళ్లు సైతం వారి కోసం బతగలరు. వారికోసం సంపాదించుకోగలరు. ఖర్చు పెట్టుకోగలరు. ఎవరిపైనా ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు. నేను ప్రేమలో పడటం, అతడితోనే బతకాలను అనుకోవడం, అది జరగకుండా పోవడం వంటివి అన్ని అయిపోయాయి" అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X