ఇద్దరు ప్రేమికులు మళ్ళీ కలిసారా? తండ్రిని కాదని ప్రేమికుడికే హీరోయిన్ ఓటు ??

కథ అయిపోయిందీ అని అంతా అనుకుంటున్న సమయం లో పాత ప్రేమికులు విశాల్ వరలక్ష్మి ఇద్దరూ కలిసి కోలీవుడ్ కి మళ్ళీ పెద్ద షాక్ ఇచ్చారు.

కథ అయిపోయిందీ అని అంతా అనుకుంటున్న సమయం లో పాత ప్రేమికులు విశాల్ వరలక్ష్మి ఇద్దరూ కలిసి కోలీవుడ్ కి మళ్ళీ పెద్ద షాక్ ఇచ్చారు. విశాల్ తో తొలిసారి 'మదగజరాజా' మూవీలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వరలక్ష్మీ ఇప్పుడు మరోసారి నల్లనయ్యతో జోడీ కట్టబోతోంది. ప్రస్తుతం ఈ వార్తే కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.అసలు కలవరు అనుకున్న ఈ ప్రేమజంట మళ్ళీ ఇలా దగ్గరవటం కోలీవుడ్ మొత్తాన్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది.

విశాల్ లవర్ గానే పాపులర్

విశాల్ లవర్ గానే పాపులర్

స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విశాల్ లవర్ గానే పాపులర్ అయింది. ఈ మధ్య విశాల్, వరలక్ష్మి ల మధ్య ఎందుకు చెడిందో తెలియాదు కానీ ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. తమిళ సినీ వర్గాల్లో ఇప్పుడు ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని

హీరో విశాల్, సినీయర్ హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చి జనాన్ని చేరేలోపే ఈ ఇద్దరూ విడిపోయిన విస్ఝయం కూదా బయటకొచ్చేసింది.. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని చాలామందికే తెల్సింది. అయితే సుధీర్ఘకాలం సాగిన వీరి ప్రేమ ఇటీవల పెటాకులైంది.

శింబుకు దగ్గరైనట్లు

శింబుకు దగ్గరైనట్లు

విశాల్ తనను పట్టించుకోవడం లేదంటూ వరలక్ష్మీ ఇన్‌డైరెక్ట్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ సంగతి పక్కనబెడివతే ఈ బ్యూటీ తమిళ రోమాంటిక్ స్టార్ శింబుకు దగ్గరైనట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికల్లో శింబు విశాల్‌కు కాకుండా శరత్‌ కుమార్‌కు మద్ధతిచ్చాడు. దీంతో శింబుకు విశాల్‌కు మధ్య కోల్డ్ వార్ నడిచింది.

విశాల్ తో బ్రేకప్ సంగతి చెప్పేసింది

విశాల్ తో బ్రేకప్ సంగతి చెప్పేసింది

విశాల్ నుంచి దూరమైన వరలక్ష్మి ట్విటర్ లోకూడా ఇండైరెక్ట్ గా విశాల్ తో బ్రేకప్ అయిన సంగతి చెప్పేసింది ఇక ఈ ఇఒద్దరి కథ కి ద ఎండ్ అనుకున్నారంతా.. విశాల్‌-వ‌ర‌ల‌క్ష్మీ ప్రేమ వ్య‌వ‌హారం శ‌ర‌త్‌కుమార్‌కు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే వీరిద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగి చివ‌ర‌కు అది న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో విశాల్ శ‌ర‌త్‌కుమార్‌పై స‌వాల్ చేసే స్థాయి వ‌ర‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్కడితోనే ఈ ప్రేమికుల మధ్య కూడా దూరం పెరగటం మొదలయ్యింది.

తండ్రి సైడ్ తీసుకున్న

తండ్రి సైడ్ తీసుకున్న

వరలక్ష్మి మాత్రం ఇక ఈ బందానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిందే అని నిర్ణయించుకుండంటూ వార్తలు వచ్చాయి. శరత్‌కుమార్‌ అంటే విశాల్‌కి పడదు. ఇద్దరి మధ్యా తమిళ సినీ రాజకీయాల పరంగా ఎన్నో వివాదాలున్నాయి. 'నువ్వెంత..' అని విశాల్‌ అంటే, 'నువ్వెంత..' అని శరత్‌కుమార్‌ సవాల్‌ విసిరిన, విసురుకున్న సందర్భాలున్నాయి.

వరలక్ష్మితో క్లోజ్‌గా వున్న ఫొటో

వరలక్ష్మితో క్లోజ్‌గా వున్న ఫొటో

ఈ వివాదాల కారణంగానే ఆ మధ్య శరత్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ టైమ్‌లోనే, తన ప్రేమ గురించి విశాల్‌ సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో పెట్టాడు కూడా.ఈ ఫోటోలోనే వుంది అంతా..' అంటూ వరలక్ష్మితో క్లోజ్‌గా వున్న ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టి, 'అసందర్భం.. అమానవీయం..' అనే విమర్శల్ని విశాల్‌ ఎదుర్కొన్నాడు.

నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు

నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు

'నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు..' అంటూ వరలక్ష్మి, సోషల్‌ మీడియాలో విశాల్‌ని ఉద్దేశించి పోస్ట్‌ చేయడం తో అంతా ఇక పెళ్ళి సమయం వచ్చిందనే అనుకున్నారు. కానీ అంతలోనే మళ్ళీ 'ప్రేమకి టైమ్‌ లేదు.. కెరీర్‌లో బిజీగా వున్నాను.. అసలు పెళ్ళి మాటే లేదు..' అని ఈ మధ్యనే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చింది. ఇక అప్పుడు అందరి కళ్ళూ తెరుచుకున్నాయి వీళ్ళ బ్రేకప్ నిజమే అని అందరికీ అర్థమైపోయింది....

శరత్ కుమార్‌తో వైరం కారణంగా

శరత్ కుమార్‌తో వైరం కారణంగా

కలిసి నటించింది ఒకే ఒక్క సినిమాలో అయినా చిన్నప్పటి నుండీ స్నేహితులు కావడంతో విశాల్ - వరలక్ష్మీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని కోలీవుడ్ వర్గాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి.. శరత్ కుమార్‌తో వైరం కారణంగా బయటకు వ్యక్తం చేయడం లేదు కానీ. విశాల్... వరలక్ష్మీని వివాహం చేసుకునేది ఖాయమనీ కొందరంటున్నారు...

మదగజరాజా

మదగజరాజా

ఈ నేపథ్యంలో 'మదగజరాజా'లో తొలిసారి జోడీ కట్టిన ఈ జంట... ఇప్పుడు మరోసారి స్క్రీన్ ను షేర్ చేసుకోబోతోంది... విశాల్ నటించి, నిర్మించబోతున్న 'పందెం కోడి' సీక్వెల్ లో వరలక్ష్మీ ఓ కీలక పాత్ర పోషించబోతోందట..తనకు బ్రేక్ ఇచ్చిన 'పందెం కోడి' మూవీకి సీక్వెల్ చేయాలని విశాల్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు...

ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు

ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు

దర్శకుడు లింగుస్వామి సైతం ఈ సినిమా మీద కొద్ది రోజులు వర్క్ చేసి, ఆ తర్వాత ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు... దాంతో ఆగ్రహించిన విశాల్ నిర్మాతల మండలికి లింగుస్వామి మీద ఫిర్యాదు చేశాడు... ఇప్పుడు మళ్ళీ సమీకరణాలు మారడంతో లింగుస్వామి 'పందెంకోడి' సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు... తొలి భాగంలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా... ఇందులో కీర్తి సురేశ్ చేస్తోంది...

విశాల్ మీద ప్రేమతో

విశాల్ మీద ప్రేమతో

అయితే మరో కీలకమైన పాత్రకు వరలక్ష్మీని ఎంపిక చేశారట. విశేషం ఏమంటే... ఇప్పటికే ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న వరలక్ష్మి, విశాల్ మీద ప్రేమతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చిందట... జులైలో సెట్స్ కెళుతున్న 'పందెం కోడి' సీక్వల్ ఈ లవర్స్ ని మళ్ళీ కలిపి పెళ్ళి వరకూ నడిపిస్తుందా అన్నది అందరినీ తొలుస్తున్న అనుమానం చూద్దాం మరి ఏం జరగనుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X