'వసూల్' రుషిరాజ్ - కిరణ్ రాథోడ్
'అందరూ దొంగలే..దొరికితే', 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' వంటి చిత్రాలతో కిరణ్ రాథోడ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో సైతం విక్రమ్ 'జెమినీ', కమల్ హాసన్ 'అన్బే శివం' చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కొద్ది గ్యాప్ తర్వాత కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలో 'హైస్కూలు' అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెలుగులో తెరకెక్కుతోంది. ఇందులో 30 ఏళ్ల యువతిగా 13 ఏళ్ల క్రుర్రాడు ప్రేమాయణం నడిపే పాత్ర ఆమెకు మంచిపేరు తెచ్చిపెడుతుందని చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు. తాజాగా కిరణ్ రాథోడ్ తమిళంలో నటించిన తమిళ 'వసూల్' చిత్రాన్ని లక్ష్మీ బాలాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడ్డాల వెంకటరావు, చింతలపూడి వాసు సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.
తమిళంలో 'వసూల్' చిత్రం పెద్ద సక్సెస్ అయిందనీ, ఆ చిత్రం తెలుగు నేటివిటీకి కూడా బాగా దగ్గరగా ఉండటంతో ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసి డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రమని, కిరణ్ రాథోడ్ నటన సినిమాకి హైలైట్ అవుతుందనీ చెప్పారు. ఎంతో పగడ్బందీగా పూర్తి ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రుషిరాజ్ తెరకెక్కించారనీ, త్వరలోనే అనువాద కార్యక్రమాలు ప్రారంభిస్తామనీ పేర్కొన్నారు. టైటిల్ కు తగ్గట్టుగా ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











