twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vedaant Madhavan: దేశానికి పేరు తెచ్చిన మాధవన్ కొడుకు: రెండు పతకాలతో వేదాంత్ సంచలనం

    |

    సినీ రంగానికి చెందిన వాళ్లు సాధారణంగా తమ వారసులను ఇదే ఫీల్డులోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను హీరోలు గానో, హీరోయిన్ల గానో, టెక్నీషియన్లు గానో ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. తన కుమారుడు వేదాంత్ మాధవన్‌కు స్మిమ్మింగ్‌లో ఆసక్తి ఉందని గ్రహించిన ఆయన.. చిన్నప్పటి నుంచే అందులో కోచింగ్ ఇప్పించారు. దీంతో ప్రస్తుతం అతడు ఏకంగా భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో పోటీల్లో పాల్గొంటున్నాడు.

    Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!

    స్విమ్మింగ్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాధవన్ కుమారుడు వేదాంత్‌ తన కష్టాన్ని అంతా దారపోసి భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. ఇప్పటికే పలు దేశాల్లో జరిగిన చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న వేదాంత్ మాధవన్.. ఇండియాకు ఎన్నో పతకాలను తెచ్చి పెట్టాడు. దీంతో అతడు చాలా కాలం క్రితమే అందరికీ సుపరిచితుడు అయిపోయాడు. ఫలితంగా మాధవన్ కూడా తన కొడుకు ఎదుగుదలను చూసుకుంటూ.. అతడి ఆటతీరు గురించి సోషల్ మీడియాలో పోస్టులను చేస్తూ పుత్రోత్సహంతో పొంగిపోతున్నాడు.

    తన స్విమ్మింగ్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అధిగమించడంతో పాటు ఎన్నో పతకాలను గెలుచుకున్న వేదాంత్ మాధవన్.. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎంతో ఫేమస్ అయిన డానిష్ ఓపెన్ 2022లో పాల్గొంటున్నాడు. ఇందులో అతడు ఆదివారం భారత్ తరపున రజత పతకాన్ని గెలుచుకున్నాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ పోటీలలో 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో వేదాంత్ ఈ మెడల్ సాధించాడు. ఇక, ఇందులో భారత్‌కే చెందిన సాజన్ ప్రకాష్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇందులో వీళ్లిద్దరికీ కేవలం పది మిల్లీ సెకెన్ల తేడా మాత్రమే ఉండడం గమనార్హం.

    మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!

    Vedaant Madhavan Wins 800 M Freestyle Gold At Danish Open Swimming Meet

    ఆదివారం స్వర్ణ పతకాన్ని తృటిలో కోల్పోయిన వేదాంత్ మాధవన్.. తాజాగా జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. తద్వారా ఇందులో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తన కుమారుడు గోల్డ్ మెడల్ తీసుకుంటోన్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన వేదాంత్‌కు ప్రముఖులతో పాటు సామాన్యుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక, కొడుకును ఇంతలా ప్రోత్సహిస్తోన్న హీరో మాధవన్‌ను కూడా నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో వేదాంత్ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది.

    ఇదిలా ఉండగా.. మాధవన్ నటించి దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్' మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. దీన్ని జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనితో పాటు మాధవన్ ప్రస్తుతం 'అమ్రికీ పండిట్', 'ఢోకా రౌండ్ డీ కార్నర్' వంటి హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన షూటింగ్‌లు కూడా పూర్తయ్యాయి. ఇక, తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేయడానికి ఆయన సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    English summary
    Actor R Madhavan is on cloud nine as his son Vedaant Madhavan has bagged a gold medal in swimming at the Danish Open 2022.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X