వీరప్పన్ సీరియల్ రద్దు!
మక్కల్ టీవీ ప్రసారం చేస్తున్న వీరప్పన్ సీరియల్ ప్రసారాన్ని ఆపివేయాల్సిందిగా చెన్నయ్ సిటీ సెషన్స్ కోర్టు మద్యంతర స్టేను మంజూరు చేసింది. సీరియల్ ను బ్యాన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వీరప్పన్ భార్య వి.ముత్తులక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్ కు స్పందించిన అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్.సడైయాండి ఈ మంజూరి ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు సెప్టెంబర్ 17న ఎనిమిదవ అసిస్టంట్ సిటీ సివిల్ కోర్టు స్టే వేకేట్ చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ముత్తులక్ష్మీ సిటీ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసింది. తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు, కుటుంబం యొక్క ప్రైవసీని కాపాడుకునే హక్కు తనకు ఉందంటూ, ఈ సీరియల్ వీటిన్నిటినీ హరించేలా ఉందని, సీరియల్ ను బ్యాన్ చేసి తనకు న్యాయం చేయాలని ఈ పిటిషన్ లో ముత్తులక్ష్మి కోరింది. సీరియల్ నిర్మాత తమ అనుమతి తీసుకోలేదని, సీరియల్ లో చిత్రంచిన పలు అంశాలు నిజమా కావా అనేది కూడా నిర్ధారణ చేసుకోలేదని ఆమె అంటున్నారు.


Click it and Unblock the Notifications











