వీరప్పన్ భార్యతో సినిమా

అలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌పై సినిమా నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వీరప్పన్ 2004 అక్టోబర్ 18న తమిళనాడులోని ధర్మపురి జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ కమెండోల చేతిలో మరణించాడు. 'తాను వీరప్పన్‌ను 1990 జనవరి 1న ధర్మపురి జిల్లాలో నెరుప్పూర్ గ్రామంలో వివాహం చేసుకున్నానని, తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు' అని ముత్తులక్ష్మి చెపుతోంది.అలాగే చిత్రం గురించి "సినిమాలో నటించేందుకు అగ్రిమెంట్‌పై సంతకం చేశాను. నన్ను సహ నిర్మాతగా కూడా ఉండమన్నారు. ఈ విషయంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటాను" అని ఆమె అంటున్నారు.
కాగా ఈ సినిమాలో నటించేందుకు తాను సంతకం చేశానని చెప్పిన ముత్తులక్షి సినిమా గురించి ఇతర వివరాలు తెలిపేందుకు ఇష్టపడటంలేదు. గతంలోనే కొంతమంది నిర్మాతలు వీరప్పన్‌పై సినిమా తీయడానికి సంప్రదించినప్పుడు ముత్తులక్ష్మి అంగీకరించలేదు. ఇప్పడు ఆమె మనసు మార్చుకుంది. దానికి కారణం వీరప్పన్‌ను ఒక హీరోలా ఆ సినిమా చూపబోవటమే అని తెలుస్తోంది. కాగా వీరప్పన్ సినిమాను తీసే దర్శక నిర్మాతల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. యేదైమైనా ఇంత ప్లాన్ తో జరుగుతున్న వీటిని చూస్తుంటే పెద్ద నిర్మాణ సంస్థో, అనుభవమున్న దర్శకుడో బిహైండ్ ది స్క్రీన్ ఉన్నారని అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











