వేలైక్కారన్ ఆడియో వేడుక డిసెంబర్ 3న
'వేలైక్కారన్' ఆడియో డిసెంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా స్టూడియో 24 బేనర్లో తెరకెక్కుతున్న చిత్రం 'వేలైక్కారన్'. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక డిసెంబర్ 3న నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
'వేలైక్కారన్' చిత్రానికి సంబంధించి ఇప్పటికే 2 పాటలు విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇపుడు పూర్తి ఆల్బం విడుదల చేయనున్నారు. ఆడియో వేడుక భారీగా జరుపనున్నారు.

ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అనుకున్న సమయానికి సినిమా పూర్తికాక పోవడం, పోస్టు ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో సినిమా రిలీజ్ డిసెంబర్ 22కు వాయిదా వేశారు.
ఈ చిత్రంలో శివకార్తికేయన్, నయనతార, ప్రకాష్ రాజ్, రోహిణి, సతీష్, ఆర్.జె బాలాజీ తదితరులు నటిస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజా ఇంతకు ముందు తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ 'తాని ఒరువన్' చిత్రాన్నికి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











