Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అంత మాటా?: కోలీవుడ్ ఫ్యూజులు అవుట్.., ఆ డైరెక్టర్ కామెంట్స్ విన్నారా!..
అనుకున్న టైమ్ కి రిలీజ్ చేస్తామో లేదోనన్న టెన్షన్ ఓవైపు.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారేమోనన్న టెన్షన్ మరోవైపు.. ఇవి చాలనట్లు పైరసీ భూతం మరో పెద్ద తలనొప్పి. ఇన్ని ఒత్తిళ్లను అధిగమించి సినిమాను విజయ తీరాలకు చేర్చడం మామూలు విషయం కాదు.
ప్రధానంగా పైరసీ భూతం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని పట్టి పీడిస్తోంది. తమిళ ఇండస్ట్రీకి ఈ సెగ గట్టిగానే తగులుతోంది. తమిళ రాకర్స్ పేరెత్తితే చాలు అక్కడి సినిమా వర్గాలు హడలిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు చిత్ర సీమను షాక్ తినేలా చేశాయి. ఒకింత ఆశ్చర్యానికీ గురిచేశాయి.. ఇంతకీ ఏంటా సంగతి అంటే..
'వేలైక్కారన్' దర్శకుడు:
'తమిళ్ రాకర్స్ చాలా పేరున్న వెబ్ సైట్. ఇప్పుడు నేను తీసిన సినిమా వేలైక్కారన్.. ప్రపంచంలో కష్టపడి పనిచేసే ప్రతీ వ్యక్తి గురించి తీసింది. తమిళ్ రాకర్స్ కూడా చాలా కష్టపడుతారు. కాబట్టి ఈ ఒక్కసారికీ కొంచెం ఆలస్యంగా మా సినిమాను మీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయండి' -వేలైక్కారన్ దర్శకుడు మోహన్.
జవాన్ పైరసీ పై దర్శకుడు ఫైర్ !
తమిళ ఇండస్ట్రీ షాక్:
దర్శకుడు మోహన్ రాజా చేసిన కామెంట్స్ తమిళ ఇండస్ట్రీని షాక్ కు గురిచేశాయి. పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకూ తావిచ్చే అవకాశం ఉంది. ఒకరకంగా మోహన్ రాజా కామెంట్స్ ను బట్టి.. తమిళ సినీ పరిశ్రమ పైరసీ మాఫియా చేతిలో ఎలా బంధీ అయిందో అర్థం చేసుకోవచ్చు.
అది.. భ్రమే?:
ఎటూ పైరసీ మాఫియాను కట్టడి చేయలేం కాబట్టే.. మోహన్ రాజా ఈ కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. కనీసం ఇలాంటి అప్పీల్ ద్వారా సినిమా కాస్త ఆలస్యంగా పైరసీ అవుతుందని ఆయన నమ్ముతున్నట్లున్నారు. అయితే పైరసీ చేసేవాళ్లకు అంత జాలి, దయ ఉంటాయనుకోవడం దర్శకుడి భ్రమే అనుకోవాలేమో!
కాగా, డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు 'కాస్త ఆలస్యంగా పైరసీ చేయండి' అన్న వ్యాఖ్యలు చేశారు.
వేలైక్కారన్ విశేషాలు:
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా 'వేలైక్కారన్' సినిమా తెరకెక్కించారు మోహన్ రాజా. గతంలో 'తని ఒరువన్' సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించడంతో వేలైక్కారన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం కావడం.. ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసింది.
ఇంత ధీన స్థితా?
పైరసీ మాఫియా ఉచ్చులో తమిళ సినీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. కోట్లు పెట్టి తీసే సినిమాలు.. విడుదలైన మరునాడే పైరసీ అవుతుండటంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పైరసీ మాఫియాను హెచ్చరించడం పోయి.. బతిమాలుకోవాల్సి వస్తుండటం వారి ధీన స్థితికి అద్దం పడుతోంది.
టాలీవుడ్ పరిస్థితి కూడా అంతే:
ఇటీవల తెలుగులో విడుదలైన జవాన్ చిత్రాన్ని కూడా పైరసీ వదలని సంగతి తెలిసిందే. విడుదలైన మధ్యాహ్నానికే సినిమా నెట్టింట్లో దర్శనమివ్వడంతో.. నోట్లో మట్టి కొట్టారని దర్శకుడు వాపోయారు.
పైగా.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీని బయటకు వదలుతామని నిర్మాతకే బెదిరింపులు రావడం పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ పైరసీ భూతంపై గట్టిగానే పోరాడాలని నిర్ణయించుకున్నారు.