twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివకార్తీకేయన్ ‘వేలైక్కరన్’ ట్రైలర్ల హంగామా.. సినిమా 22న రిలీజ్‌కు సిద్దం

    By Rajababu
    |

    మెడికల్ మాఫియా, అవినీతి, ఆహార కల్తీ లాంటి సామాజిక అంశాలతో డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్న చిత్రం వేలైక్కరన్ డిసెంబర్ 22న రిలీజ్‌కు సిద్ధమైంది. సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ 5వ ప్రోమో ట్రైలర్‌ను రూపొందించింది. ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తున్నది. సంచలనం సృష్టిస్తునన్ వీడియో, ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు మీకోసం..

    ఎలాంటి కట్ లేకుండా సెన్సార్

    తని ఒరువన్ చిత్రం తర్వాత సామాజిక అంశంతో డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన వేలైక్కరన్ చిత్రంలో శివకార్తికేయన్, నయనతార కీలకపాత్రల్లో నటించారు. ఫిలిం సర్టిఫికెట్ కోసం ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులకు ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు సంతృప్తిని చేసి ఎలాంటి కట్ లేకుండా యూ సర్టిఫికెట్‌ను జారీ చేయడం విశేషం.

    ఆహార కల్తీ కథానేపథ్యంగా

    ఆహార కల్తీ కథానేపథ్యంగా

    ఆహార కల్తీ, అవినీతి వ్యవస్థపై మురికివాడల ప్రజలు సాగించిన పోరాటమే వేలైక్కరన్ చిత్ర కథ. ఈ చిత్రాన్ని అణగారిన ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, అందుకే ఈ చిత్రాన్ని రూపొందించాం అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

    వ్యాపార ప్రకటనలో నటించను

    వ్యాపార ప్రకటనలో నటించను

    వేలైక్కరన్ చిత్ర ప్రభావంతో హీరో శివకార్తీకేయన్ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు. ఇక నుంచి తాను వ్యాపార ప్రకటనల్లో నటించను అని ఆయన ప్రకటన చేశారు. ఆహార పదార్థాల గురించి తప్పుడు సమాచారం ఇచ్చే అంశాలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించడం గమనార్హం. అలాంటి వ్యాపార ప్రకటనలు చూసి మోసపోకుండా అవగాహన పెంచడం కోసమే ఈ సినిమా తీశామని శివకార్తీకేయన్ వెల్లడించారు.

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    వేలైక్కరన్ చిత్రంలో నయనతార, స్నేహ, ప్రకాశ్ రాజ్, ఆర్జే బాలాజీ, సతీష్, రోహిణి తదితరలు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రాన్ని 24ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్డీ రాజా నిర్మించారు. వేలైక్కరన్ చిత్రం రిలీజ్‌ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఇటీవల మూడు వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియో ట్రైలర్లకు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన లభించింది.

    English summary
    After Thani Oruvan, director Mohan Raja is back again with another socially relevant film- Velaikkaran. The movie starring Sivakarthikeyan, Fahadh Faasil and Nayanthara in lead roles is one of the most awaited Tamil films of the year. This movies fifth promo trailer launched few days back goes viral in youtube. Recently, the movie was screened for the censor board officials for film certification. It is reported that the officials were highly impressed by the movie and awarded it a clean U certificate without cutting any scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X