»   » హాట్ హీరోయిన్‌ను పెళ్లాడిన వృద్ధ దర్శకుడు.. రీల్ లైఫ్‌ను రియల్ లైఫ్‌గా..

హాట్ హీరోయిన్‌ను పెళ్లాడిన వృద్ధ దర్శకుడు.. రీల్ లైఫ్‌ను రియల్ లైఫ్‌గా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ దర్శకుడు వేలు ప్రభాకరన్ మీడియా సాక్షిగా తన సినిమాలో హీరోయిన్‌గా నటించిన షెర్లీ దాస్‌ను పెళ్లాడారు. రెండు మూడు రోజులుగా వీరి ఎఫైర్ గురించి, పెళ్లి గురించి ప్రచారం జరుగుతుంది. శనివారం ఉదయం ఇద్దరూ మీడియా ముందు ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.

త్వరలోనే తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకుంటామని, ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డామని, కలిసి జీవించాలనుకుంటున్నామని.... వేలు ప్రభాకర్, షెర్లీ దాస్ మీడియా ముఖంగా వెల్లడించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పెళ్లిల్లు సహజమే అయినా..... ఈ వయసులో వీరి పెళ్లిని చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

వేలు ప్రభాకరన్

వేలు ప్రభాకరన్

వేలు ప్రభాకరన్ తాజా సినిమా ‘ఓరు ల్యాక్కునరిన్ కాదల్ డైరీ' అనే సినిమాలో షెర్లీ దాస్ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ సినిమాకు పని చేసే క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

ప్రివ్యూ షో వద్ద

ప్రివ్యూ షో వద్ద

చెన్నైలో లే మ్యాజిక్ లాంతర్న్ అనే సినిమా ప్రివ్యూ షో సందర్భంగా శనివారం ఉదయం 10.25 గంటలకు మీడియా ముందుకొచ్చిన వేలు ప్రభాకరన్, షెర్లి దాస్ ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ వయసులో..

ఈ వయసులో..

వేలు ప్రభాకరన్ వయసు 60 ఏళ్లకుపైనే ఉంటుంది. షెర్లీ దాస్ వయసు కూడా 40 ప్లస్. ఇద్దరూ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుండటంతో ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

వేలు ప్రభాకరన్

వేలు ప్రభాకరన్

తమిళ దర్శకుడైన వేలు ప్రభాకరన్ వివాదాస్పద సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు ఎక్కువగా నాస్తికత్వం, విప్లవాత్మక అంశాలను ఫోకస్ చేస్తూ ఉంటాయి.

English summary
Velu Prabhakaran married the heroine of his previous film Kadhal Kadhai Shirley Das by exchanging rings in front of the media at around 10.25 AM at Le Magic Lantern preview screens in Chennai. We were also informed that the duo would soon be registering their wedding. We wish Velu Prabhakaran and Shirley Das a very happy married life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu