twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెరపైకి ఎల్‌టీటీఈ ప్రభాకరన్ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా?

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల నిర్మాణం జోరందుకున్నది. ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్, జయలలిత, ఎంజీఆర్ బయోపిక్ లాంటి తెరపైకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌టీటీఈ అగ్రనేత వెలుపిళ్లై ప్రభాకరన్ జీవిత చరిత్ర తెరకెక్కబోతున్నది. ఈ చిత్రంలో ప్రభాకరన్ పాత్రను యువ నటుడు బాబీ సింహా పోషించనున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియోస్ 18 నిర్మిస్తున్నది.

    లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) వ్యవస్థాపకుడు వెలుపిళ్లై ప్రభాకరన్ ప్రభాకరన్‌కు సంబంధించిన బయోపిక్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉంది. శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌తో ప్రభాకరన్ ఉద్యమించాడు. 2009లో శ్రీలంక ఆర్మీ చేతిలో ఆయన మృతిచెందాడు.

    Velupillai Prabhakaran biopic on cards

    ప్రభాకరన్ బయోపిక్‌కు జీ వెంకటేష్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో శ్రీలంకలో సివిల్ వార్ నేపథ్యంగా ఆయన నిర్మించిన నీలమ్ చిత్రం నిషేధానికి గురైంది. నీలమ్ సినిమా విడుదలైతే శ్రీలంక, భారత దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయానే కారణంతో ఆ సినిమాపై నిషేధం విధించారు. గతంలో ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర వద్ద సహాయకుడిగా పనిచేశారు.

    English summary
    After Jayalalitha, MGR biopic, life story of Velupillai Prabhakaran is in pre-production. Prabhakaran was the founder of Liberation Tigers of Tamil Eelam (LTTE). Bobby Simha has reportedly been roped in to play the role of the iconic LTTE leader. Directed by G Venkatesh Kumar, an erstwhile assistant director of Balu Mahendra, the film is going to be produced by Studios 18.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X