ఇంకో మాజీ హీరోని విలన్ చేస్తున్నారు

1980లలో తిరుగులేని హీరోగా విజయకేతనం ఎగురవేసిన నటుడు మోహన్. ఆయన మైక్ పట్టుకుని పాడిన గీతాలన్నీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. అంతేకాదు.. మోహన్ మైక్ పడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉండేది. గతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం తెరకు దూరంగా ఉన్నారు. తాజాగా నటించేందుకు సిద్ధమయ్యారు.
కొంతకాలంగా ప్రచారంలో ఉన్న తమిళ టాప్ స్టార్ సూర్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ పట్టాలు ఎక్కింది. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సూర్య, దాని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు, స్టూడియో గ్రీన్‌కు చెందిన ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా ప్రకటించారు. అవును. నా తదుపరి ప్రాజెక్టు ఇప్పుడే ఖరారయింది. సూర్య హీరోగా నటించే ఈ సినిమాకి యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఈ సినిమాని నిర్మస్తుంది అన్నారు వెంకట్ ప్రభు. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో నటించబోతున్న మొదటి టాప్ స్టార్ సూర్యనే కావడం విశేషం.
సూర్య వేసే రెండు పాత్రల్లో ఒకటి దెయ్యం (ఘోస్ట్) పాత్ర అని కోలీవుడ్ సమాచారం. చెన్నై నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వెంకట ప్రభు ఈ సినిమాని 3డీ లో తీయనున్నాడని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ 3డీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. దీనికి సంబదించిన వివరాలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. ఈ సినిమాని ఒక కొత్త ఎంటర్టైనర్ గా ఇప్పటి వరకు తమిళ్ లో రాని విదంగా రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











