మోసం చేశాడు, మరీ ఇంత చీప్‌గా: ప్రముఖ దర్శకుడిపై హీరోయిన్ ఆరోపణ!
Tamil
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
మోసం చేశాడు.. ప్రముఖ దర్శకుడిపై హీరోయిన్ !
సినిమాల్లో స్పెషల్ సాంగులు ఉండటం సర్వసాధారణం. ఒకప్పుడు వీటిని ఐటం సాంగ్స్ అనేవారు, అవి చేయడానికి సిల్మ్ స్మిత, జయమాలిని, జ్యోతి లక్ష్మి, డిస్కో శాంతి లాంటి తారలు ఉండేవారు. ఈ మధ్య కాలంలో పలువురు టాప్ హీయిన్లు కూడా ఇలాంటి సాంగ్స్‌లో నటిస్తుండటంతో స్పెషల్ సాంగ్స్ అని పిలుస్తున్నారు. ఐటం సాంగులతో పోలిస్తు స్పెషల్ సాంగ్స్‌లో వల్గారిటీ లెవల్స్ కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పాలి. తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్... సినిమా విడుదలైన తర్వాత దర్శకుడిని బ్లేమ్ చేయడం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
నన్ను వల్గర్‌గా చూపించారు
ఇటీవల తమిళంలో విడుదలైన ‘చెన్నై 600028 పార్ట్ 2' చిత్రంలో హీరోయిన్ మనీసా యాదవ్ సోపన్న సుందరి అనే పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమెపై ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించారు. అయితే ఆమె చేసిన సాంగ్ చాలా వల్గర్‌గా ఉందనే విమర్శలు రావడంతో..... డైరెక్టర్ వెంకట్ ప్రభును తిట్టిపోసే పని పెట్టుకుంది.
నన్ను మోసం చేశారు
ఈ సినిమాకు తాను సైన్ చేసే సమయంలో దర్శకుడు, నిర్మాత స్పెషల్ సాంగ్ అని చెప్పారని.... సినిమా విడుదలైన తర్వాత చూస్తే నన్ను ఐటం గర్ల్‌గా చూపించారని, ఈ విషయంలో దర్శకుడు వెంకట్ ప్రభును తనను మోసం చేశారని మనీషా యాదవ్ ఆరోపించారు.
చాలా చీప్‌గా చూపించారు
డైరెక్టర్ వెంకట్ ప్రభు... సినిమాలో నేను చేసిన సాంగ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారు. కానీ నన్ను ఇంత చీప్‌గా చూపిస్తారని అస్సలు ఊహించలేదు.... అని మనీషా యదవ్ వాపోయారు.
మిస్ యూజ్ చేశాడు
ఒక పెద్ద డైరెక్టర్‌తో సినిమా అవకాశం వచ్చిందని సంతోష పడ్డాను. కానీ ఆయన నన్ను తన సినిమాలో పూర్తిగా మిస్ యూజ్ చేశాడు. తన కెరీర్లో ఇదొక గుణపాఠం లాంటిదని, ఇకపై తన పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, ఫ్యూచర్లో ఇలాంటి పాత్రలు, స్పెషల్ సాంగులు అస్సలు చేయను అని మనీషా యాదవ్ తెలిపారు.
Manisha Yadav did an item number for 'Chennai 600028 part 2'. She essayed the role of 'Soppana Sundari' in that item song. Now, she opened up about that item song and said, "Venkat Prabhu deceived me and made me dance in that cheap song. Venkat Prabhu sir just said this song will be the turning point in the movie. I trusted him and he misused my trust. I have high hopes for my next project."
Story first published: Thursday, December 28, 2017, 15:19 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more