ఆ యంగ్ డైరక్టర్ దర్శకత్వంలో కమల్ హాసన్?

By Srikanya

కమల్ హాసన్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్నాడని సమాచారం. అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే వెంకట్ ప్రభు కమల్ హాసన్ ని కలసి స్క్రిప్టు మొత్తం వినిపించాడని,దానికి ఆయన చాలా మెచ్చుకుని డేట్స్ ఇస్తానని ప్రామిస్ చేసాడని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందిటానికి సన్నాహాలు చేస్తున్నాడని చెన్నై వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే కమల్ హాసన్ చాలా ఎక్కువ రెమ్యునేషన్ అడిగారని,దానికి నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారని అంటున్నారు. అంతేగాక తన రాజ్ కమల్ బ్యానర్ తరుపున చిత్రం కొన్ని ఏరియాల పంపణీ హక్కులు డిమాండ్ చేసారని వినిపిస్తోంది. అయితే కమల్ కి సబ్జెక్టు పూర్తిగా నచ్చింది కాబట్టి అవసరమైతే తన సొంత బ్యానర్ లోనే చేసే అవకాశముందని కొందరంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని అమ్మ క్రియోషన్స్ పై శివ అనే నిర్మాతకు చేస్తానని వెంకట్ ప్రభు హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. దాంతో రెమ్యునేషన్ విషయమై బేరసారాలు జరుగుతున్నాయని,త్వరలోనే అవి తెమిలి సెట్స్ మీదకు వెళ్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎ వెన్సడే చిత్రం అనంతరం కమల్ ఏ చిత్రాన్ని ఒప్పుకోలేదు.వెంకట్ ప్రభు ఇంతకు ముందు తీసిన సరోజ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X