అజిత్-విజయ్ పిక్ వైరల్.. ప్రేమను పంచండి ద్వేషాన్ని ఆపండి.. దర్శకుడి కామెంట్స్
తమిళ నాట ఫ్యాన్స్ వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్, దళపతి విజయ్, తలా అజిత్ అభిమానుల మధ్య నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా విజయ్-అజిత్ ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ ఇద్దరి ఈ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఇలా వీరి ఫ్యాన్స్ హల్చల్ చేస్తూ ఉంటే వారు మాత్రం కూల్‌గా ఉంటారు. నేడు సిబ్లింగ్స్ డే (అన్నదమ్ముల దినోత్సవం). ఈ సంద్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు షేర్ చేసిన పిక్, చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

అజిత్-విజయ్ ఫ్యాన్స్ హల్చల్..
ఫ్యాన్ వార్ అనేది ఎక్కడైనా సర్వసాధారణమే అయినా.. తమిళనాట మాత్రం హద్దులు దాటుతుంది. వేళాపాళా లేకుండా ఇరువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తలపడుతూనే ఉంటారు. వీరి ట్విట్టర్ వార్ ఎంతగా వైరల్ అవుతుందంటే.. దేశమొత్తం వీరి వైపే చూడాల్సి వస్తుంది.

రికార్డుల పేరిట పోరు..
తమ హీరో చిత్రం ఎక్కువ కలెక్ట్ చేసిందంటే.. కాదు కాదు తమ హీరో చిత్రమే రికార్డులు క్రియేట్ చేసిందంటూ హల్చల్ చేస్తారు. అయితే ఈ ఇరువురు హీరోలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద లెక్కల పోటీ ఎక్కువైంది.

అజిత్ ఫ్యాన్స్‌ను కూల్ చేసే ప్రయత్నం..
దళపతి ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్ చిత్రం ఆడియో వేడుక ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడుతూ.. అజిత్ నా ఫ్రెండ్.. ఆయన స్టైల్లో ఆయనకు నచ్చిన సూట్ వేసుకుని వచ్చానని చెప్పడంతో సభ అంతా ఘోల్లుమంది. అజిత్ ఫ్యాన్స్‌ను మచ్చిక చేసుకునేందుకు విజయ్ అలా ప్రయత్నించాడు.
Recommended Video
ద్వేషాన్ని ఆపండి అంటూ ట్వీట్..
నేడు సోదరుల దినోత్సవం కావడంతో... దర్శకుడు వెంకట్ ప్రభు అజిత్, విజయ్‌లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. దీంతో పాటు.. ట్విట్టర్ పీపుల్స్‌కు సిబ్లింగ్ డే శుభాకాంక్షలు.. ప్రేమను పంచండి.. ద్వేషాన్ని ఆపండి అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ఫోటో.. ఇరువురి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











