కమల్ టైటిల్ తో హీరో సూర్య చిత్రం

ఇక సూర్య తమ్ముడు కార్తీ చిత్రం బిర్యాని ప్రమోషన్ లో ..స్టూడియో గ్రీన్ బ్యాన్ త్వరలో ఓ స్టైయిట్ చిత్రం చేయనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో హీరో సూర్య. ఈ మేరకు దర్శకుడు వివి వినాయిక్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి స్ధాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.
అలాగే 'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.
లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్ డ్రాగన్ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్ సంతోష్‌శివన్ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











