విజయ్ దళపతిపై వేణుస్వామి జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

విజయ్ దళపతి (Vijay) ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయిన పేరు. సినిమాల్లో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తమిళనాడులో టీవీకే పార్టీతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్.. తొలి ప్రయత్నంలోనే రికార్డ్ స్థాయిలో విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించిందనే ప్రచారం నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయనే చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? విజయ్ ముఖ్యమంత్రి అవుతారా? అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినా.. సోషల్ మీడియాలో మాత్రం భారీగా వైరల్ అవుతుంటాయి. ఈసారి ఆయన ఫోకస్ మొత్తం తమిళనాడు రాజకీయాలపైనే పడింది. తాజాగా దళపతి విజయ్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా కూడా అది ఎక్కువకాలం నిలవదని, మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Venu Swamy Sensational Prediction on TVK Vijay Politics and Trisha Goes Viral Again
Recommended For You
నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..
నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..

తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన వేణుస్వామి.. 2026 మే 25 నుంచి జూన్ 2 మధ్య జరిగే గురు మార్పు దేశ రాజకీయాల్లో పెద్ద మార్పులకు కారణమవుతుందని చెప్పారు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడని, ఆ తర్వాత సెప్టెంబర్‌లో సింహరాశిలోకి మారతాడని తెలిపారు. ఈ గురు మార్పు ప్రభావం కొన్ని రాష్ట్రాలపై తీవ్రంగా పడుతుందని ఆయన విశ్లేషించారు. వేణు స్వామి ప్రకారం.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనిపించడం ప్రారంభమైందట.

You May Also Like
మనమంటే చిన్నచూపు.. కనీస గౌరవం కూడా ఇవ్వరు..
మనమంటే చిన్నచూపు.. కనీస గౌరవం కూడా ఇవ్వరు..

ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో అస్థిరత తప్పదని వేణుస్వామి పేర్కొన్నారు. విజయ్ జాతకం, తమిళనాడు రాష్ట్ర జాతకాన్ని కలిపి పరిశీలిస్తే.. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని అన్నారు. "తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రావడం వెయ్యికి వెయ్యి శాతం ఖాయం" అంటూ ఆయన చెప్పడం సంచలనంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలలోనా, ఆరు నెలల్లోనా, లేక ఏడాదిలోపునా రాజకీయ సంక్షోభం రావచ్చని.. కానీ మళ్లీ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

150 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు పాట.. ఆ లిరిక్స్‌లో అంత పవర్ ఉందా?
150 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు పాట.. ఆ లిరిక్స్‌లో అంత పవర్ ఉందా?

వేణుస్వామి విశ్లేషణలో మరో ఆసక్తికర అంశం హీరోయిన్ త్రిష పేరు ప్రస్తావన. విజయ్-త్రిష కాంబినేషన్‌ను ఆయన "ఏకనాడి కాంబినేషన్"గా అభివర్ణించారు. త్రిష ప్రభావం లేకపోతే విజయ్ ఎన్నికల ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విజయ్-త్రిష రిలేషన్ పై ఎన్నో రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఆ చర్చలకు మరింత ఊతమిచ్చాయి.

Godari Gattupaina Day 1 collections: గోదారి గట్టుపైన తొలిరోజు కలెక్షన్స్.. సుమంత్ ప్రభాస్ మూవీ పరిస్థితేంటి?
Godari Gattupaina Day 1 collections: గోదారి గట్టుపైన తొలిరోజు కలెక్షన్స్.. సుమంత్ ప్రభాస్ మూవీ పరిస్థితేంటి?

అయితే వేణుస్వామి ప్రధానంగా చెప్పదలచుకున్నది రాజకీయ అస్థిరత గురించే. గురువు మార్పు వల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ మార్పులు, అంతర్గత విభేదాలు, రాజకీయ సంక్షోభాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్ర జాతకం ప్రకారం అలాంటి ప్రభావమే కనిపిస్తోందని తెలిపారు. ఇదే సమయంలో ఆయన పశ్చిమ బెంగాల్ రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా.. భవిష్యత్తులో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.మమతా బెనర్జీ జాతకంలో తిరిగి సీఎం అయ్యే యోగం కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ మూవీలో కాంట్రవర్సీ నటుడు.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
ఎన్టీఆర్ మూవీలో కాంట్రవర్సీ నటుడు.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఆయన గతంలో చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఇవన్నీ కేవలం ప్రచారం కోసమేనని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల వంటి సున్నితమైన అంశాలపై జ్యోతిష్య అంచనాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న చర్చ కూడా నడుస్తోంది.

నన్ను బలిపశువును చేశారు.. ఆ భయంతోనే అలాంటి సినిమాలు: సంజనా ఎమోషనల్
నన్ను బలిపశువును చేశారు.. ఆ భయంతోనే అలాంటి సినిమాలు: సంజనా ఎమోషనల్

ఇక విజయ్ రాజకీయ భవిష్యత్తు విషయానికి వస్తే.. తమిళనాడులో ఆయనకు భారీ యువత మద్దతు కనిపిస్తోంది. సినిమాల్లో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్లస్ అవుతోంది. సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా యువత విజయ్ వైపు చూస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తొలి ఎన్నికల్లోనే టీవీకే పార్టీకి వచ్చిన భారీ స్పందన తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మద్దతు లభిస్తే విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

PEDDI: నార్త్ అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. రిలీజ్‌కు ముందే ఆల్ టైమ్ రికార్డ్..
PEDDI: నార్త్ అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. రిలీజ్‌కు ముందే ఆల్ టైమ్ రికార్డ్..

ఏదేమైనా.. వేణుస్వామి చేసిన ఈ జోస్యాలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నిజంగానే విజయ్ సీఎం అవుతారా? ప్రభుత్వం నిలుస్తుందా? లేక మళ్లీ ఎన్నికలు వస్తాయా? అన్న ఆసక్తి ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లో కూడా పెరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X