500పైగా చిత్రాలు.. బీచ్‌లో కర్చీఫ్‌లు అమ్ముకుంటున్న సీనియర్ నటి, ఈ దుస్థితికి కారణం..
ఆర్థిక ఇబ్బందులు ఎంతటి వారికైనా తప్పవు. సినీతారలు కూడా ఇందుకు అతీతం కాదు. చాలా మంది సినీతారలు చివరిరోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వింటూనే ఉన్నాము. చాలా చిత్రాల్లో నటించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు చాలామందే ఉన్నారు. అలాంటి దీనగాధ మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళ సీనియర్ నటి రంగమ్మాల్ పాటి ఊహించని పరిస్థితిలో పర్యాటకులకు కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. రంగమ్మాల్ ని గుర్తించిన పర్యాటకులంతా ఆమె దీనస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

కర్చీఫ్‌లు అమ్ముకుంటూ
రంగమ్మాల్ పాటి తమిళ, హిందీ భాషల్లో మొత్తం 500పైగా చిత్రాల్లో నటించింది. కాగా ప్రస్తుతం ఆమె చెన్నై మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు అమ్ముకుంటూ కనిపిస్తోంది. పొట్ట కూటికోసం ఆమె ఈ వృత్తి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బామ్మ పాత్రలతో రంగమ్మాల్ తమిళంలో గుర్తింపు పొందారు. ప్రముఖ హాస్య నటుడు వడివేలుతో కలసి రంగమ్మాల్ అనేక చిత్రాల్లో నటించారు.

సంపాదన మొత్తం
తాను సంపాదించిన డబ్బు మొత్తం తన కుమారుల చదువుల కోసమే వెచ్చించానని కానీ వాళ్ళు ఇప్పుడు తనని పట్టించుకోవడం లేదని రంగమ్మాల్ అంటోంది. రంగమ్మాల్ కు 9మంది కొడుకులు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది. రంగమ్మాల్ ఎంజీఆర్ కాలం నుంచే సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో మాత్రమే కాక హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించిందట.

చాలా మంది హీరోయిన్లకు
అప్పట్లో రంగమ్మాల్ చాలా మంది హీరోయిన్లకు బాడీ డబుల్ గా నటించింది. కానీ ప్రస్తుతం తాను ప్రతి రోజు పొట్ట కూటి కోసం పోరాటం చేయవలసి వస్తోందని రంగమ్మాల్ తన దీన గాధని వివరించింది. ఇప్పుడు సినిమా అవకాశాలు వచ్చినా చేస్తానని చెబుతోంది. కర్చీఫ్ లతో పాటు పలు వస్తువులు రంగమ్మాల్ విక్రయిస్తోంది. తనని గుర్తుపట్టి చాలా మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. వారందరిని ఎదో ఒక వస్తువు కొనుగోలు చేయాలని రంగమ్మాల్ రిక్వస్ట్ చేస్తోంది.

నడిగర్ సంఘం ఆదుకుంటే
తనని ప్రభుత్వం కానీ, నడిగర్ సంఘం కానీ ఆదుకోవాలని రంగమ్మాల్ చెబుతోంది. ఇదిలా ఉండగా రంగమ్మాల్ పరిస్థితి నడిగర్ సంఘం దృష్టికి వెళ్లిందట. రంగమ్మాల్ కు 5వేలు ఆర్థిక సాయం అందించేందుకు నడిగర్ సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్టుల సంఘంలో రంగమ్మాల్ సభ్యురాలు కూడా.


Click it and Unblock the Notifications











