For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భారీ చిత్రాల నిర్మాత మృతి,ఇళయారాజా నివాళి, శోకమయంగా ఇండస్ట్రీ (ఫొటోలు)

  By Srikanya
  |

  చెన్నై: తమిళ సీనియర్‌ నిర్మాత, దర్శకుడు, మాటల, పాటల రచయిత, 'సంగీత జ్ఞాని' ఇళయరాజాను సంగీత దర్శకుడిగా సినీరంగానికి పరిచయం చేసిన నిర్మాత పంజు అరుణాచలం (75) మృతి తమిళ చిత్ర పరిశ్రమను శోక సముద్రంలో ముంచివేసింది. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నివాళులర్పించారు. అరుణాచలం కుటుంబీకులను ఓదార్చారు.

  ఆయనకు భార్య మీనా, కుమారులు షణ్ముగం, సుబ్రమణియం, కుమార్తెలు చిత్ర, గీతలు ఉన్నారు. వీరిలో సుబ్రమణియం నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు మురళి బుధవారం రాత్రి చెన్నైకి రానున్నారు. అనంతరం గురువారం కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

  పలు హిట్‌ చిత్రాలను కోలీవుడ్‌కు అందించిన అరుణాచలం మృతి పట్ల నిర్మాతలు, నటీనటులు, దర్శకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో నటులకు, సాంకేతిక కళాకారులకు జీవితాన్నిచ్చిన ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని సినీ ప్రముఖులు పేర్కొన్నారు.

  ఆయన జీవిత విశేషాలు..ఫొటోలతో..

  జననం

  జననం

  కారైకుడి సమీపంలోని సిరుకూడల్‌పట్టిలో 1941 జూన్‌ 18న అరుణాచలం జన్మించారు.

  కవిత్వం

  కవిత్వం

  పాఠశాలలో చదువుతున్న సమయంలోనే పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిన ఆయన కవిత్వం కూడా రాసేవారు.

  చదువు..

  చదువు..

  అప్పట్లో పీయూసీ పూర్తి చేసి చెన్నైకి వచ్చారు.

  దినపత్రికలో

  దినపత్రికలో

  తన బాబాయ్‌ ఏఎల్‌ శ్రీనివాసన్‌కు కవిత్వం, కథలు రాయడంపై ఉన్న ఆసక్తిని చెప్పి, వార్తాపత్రికలో చేరాలని భావిస్తున్నట్లు తెలిపారు.

  సినీ ప్రస్దానం మొదలు

  సినీ ప్రస్దానం మొదలు

  అయితే ‘ముందుగా నువ్వు సినిమా స్టూడియోలో పని చెయ్‌. ఆ తర్వాత కథలు రాయొచ్చు' అని తాను లీజుకు తీసుకున్న భరణి స్టూడియోకు అరుణాచలాన్ని పంపించారు. అక్కడే ఆయన సినీ ప్రస్థానానికి బీజం పడింది.

  ఆ తర్వాత...

  ఆ తర్వాత...

  రెండో బాబాయ్‌, ప్రముఖ పాటల రచయిత కన్నదాసన్‌ నడుపుతున్న ‘తెండ్రల్‌' పత్రికలో కథలు, కవిత్వం రాశారు.

  పలు పాటలకు..

  పలు పాటలకు..

  కన్నదాసన్‌ రాసిన పలు పాటలకు సహాయకుడిగా పని చేశారు.

  డైరక్ట్ గా..

  డైరక్ట్ గా..

  అలా 1962లో విడుదలైన ‘శారద' సినిమాకు పాటలు రాశారు. ‘మనమగలే.. మనమగలే..' అన్న పాట ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఇప్పటికీ కల్యాణవేదికలపై ఈ పాట మారుమోగుతుంటుంది.

  కథా రచయితగా..

  కథా రచయితగా..

  ఆ తర్వాత ‘చిత్రామహల్‌' అనే సినిమా ద్వారా కథా రచయితగా అవతారం ఎత్తారు.

  ఆఫర్ ఇచ్చారు

  ఆఫర్ ఇచ్చారు

  ఇళయరాజాకు అవకాశం
  ఎందరో కళాకారులకు వెండితెరపై అవకాశాలు కల్పించిన ఘనత ఆయనది.

  ఆ సినిమాతోనే

  ఆ సినిమాతోనే

  అవకాశాల కోసం ఎదురు చూసిన ఇళయరాజాను ‘అన్నక్కిలి' సినిమా ద్వారా సంగీత దర్శకుడిని చేశారు.

  ఆయనే రాసారు

  ఆయనే రాసారు

  ‘అన్నక్కిలి' సినిమా లో ‘మచ్చాన పాత్తింగలా..' పాట పెద్దహిట్‌ అయింది. ఆ పాటను రాసింది అరుణాచలమే కావడం విశేషం.

  సొంత బ్యానర్ పై

  సొంత బ్యానర్ పై

  తన పీఆర్‌ బ్యానరుపై పలు చిత్రాలను నిర్మించారు. వాటిలో ఆరులిరుందు అరువదు వరై, అలెగ్జాండర్‌, అవర్‌ ఎనక్కే సొందం, ఎల్లాం ఇన్బ మయం, ఎంగ ముదలాలి, కళుగు, మైఖెల్‌ మదన కామరాజన్‌, పూవెల్లాం కేట్టుపార్‌ వంటి పలు సినిమాలు ఉన్నాయి.

  రజనీతో..

  రజనీతో..

  రజనీకాంత్‌ హీరోగా ఆరులిరుందు అరువదువరై, ఎంగేయో కేట్టకురల్‌, గురు శిష్యన్‌, వీరా నిర్మించారు.

  కమల్ తో

  కమల్ తో

  కమల్‌ హీరోగా కల్యాణరామన్‌, మైఖెల్‌ మదన కామరాజన్‌ చిత్రాలను నిర్మించారు.

  అసెస్టెంట్ ని డైరక్టర్ గా

  అసెస్టెంట్ ని డైరక్టర్ గా

  తన వద్ద సహాయకుడిగా పనిచేసిన సెల్వరాజ్‌ను దర్శకుడిని చేసి, ఆయన కథకు కథనం రాసి నిర్మించిన ప్రత్యేకత అరుణాచలానిది. అదే ఇళయరాజా పరిచయమైన ‘అన్నక్కిలి' చిత్రం.

  మరిన్ని వాటికో..

  మరిన్ని వాటికో..

  శివాజీ నటించిన ‘వాళ్‌కై', అవన్‌దాన్‌ మనిదన్‌, రజనీ నటించిన రాజా చిన్నరోజా, తంబిక్కు ఎంద వూరు వంటి పలు సినిమాలకు స్క్రీన్‌ప్లేతో పాటు పాటలను కూడా రాశారు.

  తీరని లోటు

  తీరని లోటు

  గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం టీనగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల కోలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

  ఇళయారాజా నివాళి

  ఇళయారాజా నివాళి

  సంగీత దర్శకుడు ఇళయరాజా నివాళులర్పించారు. అరుణాచలం కుటుంబీకులను ఓదార్చారు.

  అంజలి ఘటించారు

  అంజలి ఘటించారు

  సీనియర్‌ దర్శకుడు భారతీరాజా, ఉదయ్‌కుమార్‌, రంజిత్‌, వెంకట్‌ ప్రభు, సుందర్‌.సి, మోహన్‌రాజా, నటులు శివకుమార్‌, సత్యరాజ్‌, నాజర్‌, సూర్య, కార్తి, నటి ఖుష్బూ తదితరులు అంజలి ఘటించారు.

  English summary
  Well-known Tamil writer, director and producer Panchu Arunachalam, who has been credited for taking superstar Rajinikanth to the masses, breathed his last here in Chennai on Tuesday (Aug 9), his publicist said. He was 75. "He passed away at his residence due to age-related ailments," .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X