ధనుష్ మూవీ: వివాదంలో ఫస్ట్‌నైట్ సీన్స్... దర్శకుడి క్లారిటీ!
ధనుష్, అమీర్, ఆండ్రియా, ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వడ చెన్నై' అనే తమిళ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. అదే సమయంలో ఈ సినిమాపై పలు ఆందోళనలు సైతం వెళ్లువెత్తుతున్నాయి.
ఈ చిత్రంలో తమను నెగెటివ్‌గా చూపించారని ఫిషర్‌మెన్ కమ్యూనిటీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వడ చెన్నై(నార్త్ చెన్నై) ప్రాంతాన్ని అసాంఘీక కార్యకలాపాలు జరిగే స్లమ్ ఏరియాగా చూపించారని, ఇక్కడి ప్రజలను ఫోకస్ చేసిన విధానం కూడా బాగోలేదనే విమర్శలు వస్తున్నారు.

ఫస్ట్ నైట్ సీన్ మీద అభ్యంతరం
దీంతో పాటు ఈ సినిమాలో బోట్‌లో జరిగే ఫస్ట్ నైట్ సీన్ మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో దర్శకుడు వెట్రిమారన్ స్పందించారు. సినిమా నుంచి ఈ సీన్ తొలగించడానికి సిద్ధమే అని ప్రకటించారు.
తొలగిస్తానని ప్రకటించిన వెట్రిమారన్
సినిమాపై జరుగుతున్న ఆందోళనపై దర్శకుడు వెట్రిమారన్ స్పందించారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. ఎవరినీ బ్యాడ్ లైట్లో చూపించే ప్రయత్నం చేయలేదన్నారు. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న ఫస్ట్ నైట్ సీన్ వారం రోజుల్లో తొలగించున్నట్లు వెల్లడించారు.

సినిమాలో ఏముంది?
చెన్నై నగరంలోని ఉత్తరభాగంలో ఉండే స్లమ్ ఏరియాలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. సినిమా ఎక్కువగా వారి చుట్టూ తిరుగుతుండటంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అద్భుతమైన స్పందన
కాగా... వెట్రిమారన్ చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన స్పందన వస్తోంది. ధనుష్ తన సొంత బేనర్ వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించగా... లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











