IFFI 2023 6 పేజీల స్టోరి.. 30 రోజుల షూటింగ్.. కానీ అంతా ఉల్టాపుల్టా.. విడుదలై గురించి వెట్రీమారన్

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 54వ వార్షికోత్సవ వేడుకలు గోవాలో సినీ తారల తళుకుబెళుకుల మధ్య జోష్‌గా సాగుతున్నాయి. గోవాలో నవంబర్ 22 తేదీన జరిగిన కార్యక్రమంలో తమిళంలో విమర్శకులు ప్రశంసలు అందుకొన్న విడుదలై పార్ట్ 1 చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సినిమా దర్శకుడు వెట్రీ మారన్, హీరో సూరి, నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ..

కోవిడ్ విపత్కర పరిస్థితుల కాలంలో చిన్న సినిమా చేద్దామని అనుకొని విడుదలై సినిమాను ప్రారంభించాం. దట్టమైన అడవుల్లోకి వెళ్లి 30 రోజుల్లో షూటింగ్ చేయాలని భావించాం. 6 పేజీల షార్ట్ స్టోరీ భారీగా మారిపోయింది. ఎమోషనల్ సినిమాగా మారి రెండు పార్టులు తీసేంతగా భారీ సినిమాగా మారింది. విడుదలై పార్ట్ 1 సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా భాగం కావడం గర్వంగా ఉంది. అని వెట్రీ మారన్ అన్నారు.

 Vetri Maaran at IFFI 2023 reveals secrets, interesting Story behind Viduthalai

విడుదలై సినిమాలో కుమరేషన్ పాత్రలో చాలా సులభంగా సూరి ఒదిగిపోయాడు. ఆయన కమిట్‌మెంట్ నాకు బాగా నచ్చింది. శారీరక పటిష్టత కూడా సినిమాకు ఉపయోగపడింది. సూరి యాటిట్యూడ్, ఫిజికల్ ఫిట్‌నెస్ కారణంగానే కుమరేషన్ పాత్ర పడింది అని వెట్రీ మారన్ చెప్పారు.

నటుడు సూరి మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు 160 సినిమాల్లో కమెడియన్‌గా నటించాను. కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపైకి ఓ సినిమా హీరోగా రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. ఈ ఘనత నాకు దక్కడానికి కారణం వెట్రీ మారన్‌. ఈ క్రెడిట్ ఆయనకే చెందుతుంది. విడుదలై మూవీలో కుమరేషన్ పాత్రను చాలా సులభంగా చేయడానికి కారణం వెట్రీమారన్ విజన్. అని అన్నారు.

 Vetri Maaran at IFFI 2023 reveals secrets, interesting Story behind Viduthalai

విడుదలై పార్ట్ 1 చిత్రం మార్చి 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్‌గా మంచి ఆదరణను సొంతం చేసుకొన్నది. పార్ట్ 2 సినిమా 2024 ప్రథమార్థంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి వెట్రీమారన్, మణిమారన్ స్క్రీన్ ప్లే అందించారు. ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రఫిని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X