4.30 గంటలతో షాకింగ్‌గా ఆ క్రేజీ సీక్వెల్ రన్ టైమ్ .. 3 పార్ట్‌ కూడా రెడీ!

ఇప్పుడు సినిమాలు బాగుంటే వాటికి అసలు రన్ టైం అనేది మ్యాటరే కాదని చెప్పడంలో డౌట్ లేదు. కథని దర్శకుడు ఎంత ఎంగేజింగ్ ప్రదర్శిస్తే ఆడియెన్స్ ఎంత సేపు అయినా థియేటర్లులో కూర్చోవడానికి రెడీ గానే ఉంటున్నారు. అలా అని ఎలాంటి సినిమా ఎక్కువ నిడివితో తీసినా చూడం పొమ్మని మొహం చాటేస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం అన్నట్టు మళ్ళీ నిడివి తగ్గించుకున్నా వాటిలో వచ్చే ఫలితాన్ని అవి మార్చలేకపోతున్నాయి.

అందుకే ఈ కాలంలో సినిమాకి రన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా మారింది. మరి ఆనిమల్ అనే సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చినప్పటికీ ఆడియెన్స్ ని కూరొబెట్టి 900 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టింది. అయితే ఇపుడు ట్రెండ్ లో వస్తున్న సీక్క్వెల్స్ కూడా ఇదే తరహా రన్ టైం లో మూడేసి గంటలు వస్తుంటే ఓ సీక్వెల్ కి అయితే ఏకంగా నాలుగున్నర గంటల నిడివి వచ్చిందట.

vetrimaaran awaited sequel viduthalai 2 shocking runtime

అది కూడా మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఓ సినిమాకే అట. కాగా ఆ సినిమా ఏంటి అని చూస్తే తమిళంలో మంచి రా అండ్ రస్టిక్ సినిమాలు అందించిన ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కోసం అందరికీ తెలిసే ఉంటుంది. జల్లికట్టు, అసురణ్ లాంటి భారీ హిట్స్ తీసి అదరగొట్టిన ఈ దర్శకుడు ఈ మధ్య చేసిన మరో రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా సినిమానే "విడుదలై".

తెలుగులో విడుదల పేరిట రిలీజ్ అయ్యిన ఈ సినిమా కూడాసి చాలా హార్డ్ హిట్టింగ్ సీన్స్ తో తెరకెక్కి వచ్చింది. అయితే దీనికి సీక్వెల్ ని కూడా వెట్రిమారన్ అనౌన్స్ చేసాడు కానీ దీనిని మాత్రం అలా తెరకెక్కిస్తూనే ఉన్నాడు. ఎప్పుడో అయ్యిపోవాల్సిన ఈ సీక్వెల్ అలా బడ్జెట్, సినిమా తెరకెక్కిస్తున్న సమయంలోనే స్క్రిప్ట్ లో మార్పులు చేస్తుండడంతో ఎక్కువ రోజులు తెరకెక్కించాల్సి వస్తుందట.

vetrimaaran awaited sequel viduthalai 2 shocking runtime

ఇలా ఈ సీక్వెల్ ఏకంగా నాలుగున్నర గంటలు వచ్చేసిందట. దీనితో షాకయ్యిన చిత్ర యూనిట్ దీనిని ఇప్పుడు మూడో పార్ట్ గా కట్ చెయ్యాలని చూస్తున్నారట. పార్ట్ 2 ను విజయ్ సేతుపతి బ్యాక్ స్టోరీగా తీసి మూడో భాగంతో మళ్ళీ సూరి రోల్ తో కలిసి ఒక ఎండింగ్ ఇవ్వాలని వెట్రిమారన్ ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో టాక్. ఆల్రెడీ పార్ట్ 1 మంచి హిట్ అయ్యింది.

పార్ట్ 2 కో కూడా మంచి బజ్ ఉంది కానీ ఇదేమో నాలుగున్నర గంటలొచ్చింది. సో వెట్రిమారన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. మరి పార్ట్ 1 ని కానీ ఇంకా ఎవరూ చూడనట్టు అయితే ఓటిటి యాప్ జీ 5 లో అందుబాటులో ఉంది చూడవచ్చు. కాగా ఈ చిత్రాలు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించగా ఇందుకు తగ్గట్టుగా వింటేజ్ టచ్ ఇచ్చేలా మాస్ట్రో ఇళయరాజా తోనే సంగీతం చేయించుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X