అజిత్ ఫాన్స్‌కు షాక్.. విదాముయార్చి క్రేజ్‌పై నీళ్లు చల్లిన డిస్టిబ్యూటర్లు
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన విదా ముయార్చి చిత్రం తెలుగులో పట్టుదలగా రిలీజ్‌కు సిద్దమైంది. త్రిషా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత సుభాస్కరన్ అలిరాజా నిర్మించారు. అయితే ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకొన్న అభిమానులకు లైకా ప్రొడక్షన్స్, వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్న డిస్టిబ్యూటర్లు నిరాశను కలిగించేలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఫ్యాన్స్‌కు ఆశలపై నిరాశను కలిగించిన వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
మగీజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణ్యం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ రైటర్ జోనాథన్ మోస్టో బ్రేక్ డౌన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఈ చిత్రాన్ని సుమారుగా 350 కోట్ల రూపాయలతో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫి, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

విదా ముయార్చి సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తమిళనాడులో గానీ, లేదా అమెరికా, తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు అనుమతి లేకపోవడం తీవ్ర నిరాశను కలిగిస్తున్నది.
టాప్ హీరోల సినిమాలను సాధారణంగా అమెరికాలో రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శిస్తుంటారు. కానీ అమెరికాలో అందుకు భిన్నంగా భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ సినిమా ప్రీమియర్లను ప్రదర్శించడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైకా ప్రొడక్షన్, లేదా స్థానిక డిస్టిబ్యూటర్లు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు

ఇక ఇండియాలో 4 గంటల షోలు ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కేరళ, కర్ణాటకలో ఉదయం 6 గంటల షోలు ప్రారంభం అవుతున్నాయి. ఆంధ్రాలో 6 గంటలకు, నైజాంలో 8 గంటలకు షోలు మొదలు అవుతున్నాయి. ఇక తమిళనాడులో ఇంకా దారుణంగా 9 గంటలకు షోలు ప్రారంభం కావడం తమిళ అభిమానులు మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











