రజనీకాంత్ సరసన డర్టీ హీరోయిన్

By Srikanya

చెన్నై : రజనీకాంత్ సరసన హీరోయిన్స్ చేయటానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఆయనతో చేస్తే సౌత్ మొత్తం తమ పేరు మారు మ్రోగిపోతుంది..రెమ్యునేషన్ పరంగానూ భారీగానే ఉంటుంది. దాంతో రజనీ తో సినిమా అనేది ప్రమోషన్ గా భావిస్తారు. ఈ నేఫద్యంలో బాలీవుడ్ డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ కి రజనీతో ఆఫర్ వచ్చిందని సమచారం.

కె.వి ఆనంద్ దర్శకత్వంలో రజనీ హీరోగా కథ ఓకే అయ్యిందని, అందునిమిత్తం విద్యాబాలన్ ని అడిగారని,విద్యా కూడా వెంటనే ఓకే చెప్పిందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కెవి ఆనంద్..తాను రజనీతో చేయబోతున్నానంటూ వస్తున్న వార్తలు కొట్టి పారేసారు. దాంతో ఈ వార్త ఎంతవరకూ నిజమో తేలాలి.

ఇక ప్రస్తుతం రజనీకాంత్ విక్రమ సింహ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న 'కొచ్చాడియన్' 3డి చిత్రంలో మహారాజు కొచ్చాడియన్‌గా.. భక్తులను సర్వదా కాపాడే పరమేశ్వరునిగా.. రజనీ అలరించనున్నాడు.

62 ఏళ్ల రజనీ పెర్‌ఫార్మెన్స్‌ని సరికొత్త కోణంలో చూపించనున్నట్టు సౌందర్య తెలిపారు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ 'ది అడ్వంచర్స్ ఆఫ్ టిన్‌టిన్: ది సీక్రెట్స్ ఆఫ్ ది యూనికార్న్' చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, జేమ్స్ కామెరూన్ 'అవతార్' చిత్రాన్ని డిఫరెంట్‌గా అందించిన టెక్నీషియన్లు ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దినట్టు.. భారతీయ సినిమాలో పూర్తి స్థాయిలో హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగించినట్టు సౌందర్య పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X