ఆయన కోరిక కాదనలేకపోయా.. బలవంతం చేస్తే ఒప్పుకొన్నా.. విద్యాబాలన్!

Recommended Video

Vidya Balan Signs For Pink Movie Remake | Filmibeat Telugu

బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ ఇప్పటి వరకు దక్షిణాదిలో రెండు బయోపిక్స్‌లో నటించారు. ఒకటి సిల్క్ స్మిత, రెండోది ఎన్టీఆర్ బయోపిక్. తాజాగా మరో సినిమాలో తమిళ సూపర్‌స్టార్ అజిత్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన పింక్ సినిమా రీమేక్‌లో నటించనున్నారు. ఈ చిత్రానికి బోనికపూర్ నిర్మాత కావడం గమనార్హం. ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ..

తమిళ భాషలో పింక్ చిత్రం

తమిళ భాషలో పింక్ చిత్రం

హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రంలో నటిస్తున్నాను. అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను అజిత్ కుమార్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాను. బోనికపూర్‌పై ఉన్న గౌరవం కారణంగానే ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకొన్నాను అని విద్యాబాలన్ చెప్పింది.

బోని కపూర్ ఆఫర్ కాదనలేకపోయా

బోని కపూర్ ఆఫర్ కాదనలేకపోయా

తమిళంలో రూపొందే పింక్‌ చిత్రంలో నాది చాలా చిన్న పాత్ర. బోని కపూర్ నిర్మిస్తున్నారు. ఓ స్పెషల్ పాత్ర ఉంది చేస్తావా అని బోని అడిగారు. ఆయన ఆఫర్‌ను కదనలేక స్పెషల్ రోల్‌ను ఒప్పుకొన్నాను. తమిళ పింక్ చిత్రాన్ని కేవలం బోనికపూర్ కోసమే చేస్తున్నాను. ఆయన అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఆ చిత్రంలో ఉండే ముగ్గురు మహిళల్లో నేను ఒకరిని కాదు అని విద్యాబాలన్ తెలిపారు.

కోర్టు డ్రామాగా పింక్ మూవీ

కోర్టు డ్రామాగా పింక్ మూవీ

తమిళంలో రూపొందే పింక్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకుడు. అజిత్ లాయర్ పాత్రలో కనిపిస్తారు. హిందీలో ఆ పాత్రను అమితాబ్ బచ్చన్ చేశారు. తాప్సీ పన్ను పాత్రలో నజ్రియా నాజిమ్ నటిస్తున్నట్టు సమాచారం. కోర్టు డ్రామాగా ఈ చిత్రం రూపొందింది.

 అక్షయ్ కుమార్‌తో మిషన్ మంగళ్ మూవీ

అక్షయ్ కుమార్‌తో మిషన్ మంగళ్ మూవీ

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ఆమె నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. దక్షిణాదిలో మంచి పాత్రలు వస్తే చేస్తానని విద్యాబాలన్ చెప్పారు. అలాగే అక్షయ్ కుమార్‌తో కలిసి విద్యాబాలన్ మిషన్ మంగళ్ అనే చిత్రంలో కీలకమైన సైంటిస్ట్ పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X