twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం అందుకే ఫ్లాప్.. ఆ విషయంలో నేను సక్సెస్ అవుతా.. విద్యుల్లేఖ రామన్

    |

    హిందీలో ప్రేక్షకాదరణ పొందిన కామిక్‌స్థాన్ స్టాండప్ కామెడీ షోను తొలిసారి తమిళ భాషా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ స్టాండప్ కామెడీకి సంబంధించిన ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. తమిళంలో తొలిసారి ప్రవేశపెట్టిన స్టాండప్ కామెడీ షోలో సభ్యురాలైన కమెడియన్ విద్యుల్లేఖ రామన్ మీడియాతో తన అనుభవాలను పంచుకొన్నారు. ఆమె ఫిల్మ్‌బీట్ తెలుగుతో మాట్లాడుతూ...

     నాటక రంగం నుంచి వచ్చా

    నాటక రంగం నుంచి వచ్చా

    నేను నాటక రంగం నుంచి వచ్చాను. నాటకాలు వేయడానికి స్ఫూర్తి మా నాన్న నాకు స్ఫూర్తి. తొలిసారి స్టాండప్ కామెడీ చేస్తున్నాను. ఇది కూడా నాటకం లాంటిందే. కాబట్టి నాకు చాలా సంతృప్తిని కలిగించింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. ఈ కామెడీ ఎపిసోడ్స్ 18 ఏళ్ల లోపు ఉన్నవారే చూడాలి. ఈ షోలో పాలిటిక్స్, సమకాలీన అంశాలతోపాటు రిలేషన్ షిప్స్, అడల్డ్ కంటెంట్ ఉంటుంది అని విద్యుల్లేఖ రామన్ తెలిపారు.

    స్టాండప్ కామెడీలో అడల్ట్ కామెడీ

    స్టాండప్ కామెడీలో అడల్ట్ కామెడీ

    స్టాండప్ కామెడీలో అడల్డ్ కంటెంట్ ఓ భాగం. అప్పడుప్పుడు కొందరు కమెడియన్లు బూతులు వాడుతుంటారు. అశ్లీల పదాలు వాడటమనేది స్టాండప్ కామెడీలో ఉండాల్సిందే. కొందరు అడల్డ్ కామెడీతోనే స్టాండప్ కామెడీ చేస్తున్నారు. అలాంటి కామెడీకి మంచి రెస్పాన్స్ ఉంటుంది. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో అది చేయాల్సిందే. కొందరు అడల్డ్ కామెడీ నమ్ముకొంటే.. కొందరు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఒక్కో కమెడియన్‌కు ఒక్కో శైలి ఉంటుంది అని విద్యుల్లేఖ రామన్ అన్నారు.

     బ్రహ్మానందం షో ఫ్లాప్ ఎందుకైందంటే

    బ్రహ్మానందం షో ఫ్లాప్ ఎందుకైందంటే

    ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం చేసిన స్టాండప్ కామెడీ షో చూశాను. ప్రజంటేషన్ సరిగా లేదు. స్టాండప్‌ కామెడీకి కావాల్సిన కంటెంట్‌ను సరిగా తీసుకోలేదు. సరిగా హోంవర్క్ చేయలేదనే అభిప్రాయం కలిగింది. కేవలం స్టాండింగ్ కామెడీ‌లోని బేసిక్ కంటెంట్‌ను వారు తీసుకొన్నారని అనిపించింది. అందుకే అది హిట్ కాలేదు. అయితే కామిక్‌స్థాన్‌ తమిళ్‌లో కంటెంట్‌ను జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. మా షో ప్రేక్షకులను ఆకట్టుకొంటుందన్న నమ్మకం నాకు ఉంది. బ్రహ్మానందం షోను మా షోను పోల్చి చూడకూడదు అని విద్యుల్లేఖ రామన్ చెప్పారు.

    స్టాండప్‌ కామెడీలో మహిళలు సక్సెస్

    స్టాండప్‌ కామెడీలో మహిళలు సక్సెస్

    స్టాండప్ కామెడీ షోలో మహిళలు ఎక్కువగా రాణిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ చెప్పిన స్క్రిప్టును, డైలాగ్స్‌ను పక్కాగా ఫాలో కావాలి. కానీ స్టాండప్ కామెడీ విషయానికి వస్తే అలా ఉండదు. వారు కాన్సెప్ట్ చెప్తారు. దానికి తగినట్టు కొంత డైలాగ్స్ ఇస్తారు. ఆ తర్వాత ఆ కాన్సెప్ట్‌ను, డైలాగ్స్‌ను ఇంప్రూవైజ్ చేసి మనకు నచ్చిన మాటలు, డైలాగ్స్‌ను మన స్టైల్లో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయ వ్యక్తుల ప్రతిభ బయటకు వస్తుంది. అందుకే స్టాండప్ కామెడీ విషయంలో భారతీ, అర్చనా పూరన్ సింగ్ లాంటి వాళ్లు సక్సెస్ అయ్యారనేది నా అభిప్రాయం అని విద్యుల్లేఖ రామన్ అన్నారు.

    Recommended Video

    If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him
     తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీ ప్రోత్సాహం

    తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీ ప్రోత్సాహం

    తమిళ పరిశ్రమకు చెందిన నాకు, నా కామెడీకి, తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీ నాకు సహకారం, ప్రోత్సాహం అందించారు. అలాంటి ఎంకరేజ్‌మెంట్ తమిళ ప్రేక్షకుల నుంచి గానీ, కోలీవుడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. విద్యుల్లేఖ రామన్‌కు మంచి క్యారెక్టర్ ఇద్దామనే ఆలోచన చేయలేదు. ఇక నాకు హాస్య నటుల్లో మనోరమ, కోవై సరళ, శ్రీలక్ష్మి నాకు స్ఫూర్తి అని విద్యుల్లేఖ రామన్ పేర్కొన్నారు.

    English summary
    South comedian Vidyullekha Raman is doing a Stand up comedy show. Comicstaan Semma Comedy Pa is streaming on Amazon Prime video. In this juncture, Vidyallekha Raman met Telugu filmibeat on zoom call. He revealed things about the comicstaan Tamil show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X