ఆ రోజు ఒక్క డ్రెస్ కూడా సెట్టవ్వలేదు,నా బరువు చూసి నాకే సిగ్గేసింది..అందుకే తగ్గాను:లేడి కమెడియన్
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది కమెడియన్స్ కి ఉన్న క్రేజ్ స్టార్ హీరోలకు కూడా ఉండదనే చెప్పాలి. ఇక ఈ లాక్ డౌన్ లో చాలా వరకు అలాంటి వారు సోషల్ మీడియాలో కాస్త కొత్తగా దర్శనమిచ్చారు. సినిమాలతో ఎక్కువగా బిజీగా ఉండే ఆర్టిస్టులకు కొంత గ్యాప్ రావడంతో ఫిట్నెస్ ప్రయోగాలు గట్టిగానే చేశారు. అలాంటి వారిలో ఎక్కువగా ఆశ్చర్యపరిచింది మాత్రం లేడి కమెడియన్ విద్యుల్లేఖ అనే చెప్పాలి. ఏకంగా 20కేజీల బరువును కరిగించినట్లు చెప్పింది.

బరువు వల్ల ఇబ్బందులు
లేడి కమెడియన్ గా పలు తెలుగు తమిళ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విద్యుల్లేఖ సినిమాల్లో తన హావభావాలతో ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన ఆకరంతోనే ఆమె నవ్వించే ప్రయత్నం చేస్తోంది. వెండితెరపై ఆమెను చూసి ఆడియెన్స్ నవ్వినప్పుటికి విద్యుల్లేఖ మాత్రం బరువు వలన చాలా సార్లు ఇబ్బంది పడిందట.

ఎమోషనల్ పోస్ట్
ఇటీవల సోషల్ మీడియాలో ఆమె బిఫోర్ ఆఫ్టర్ అనేలా ఒక స్పెషల్ ఫోటోను పోస్ట్ చేసి ఎమోషనల్ గా కామేంట్స్ చేసింది. 20కేజీల బరువు తగ్గడం అనే సాధారణమైన విషయం కాదు. చాలా శ్రమతో కన్నీరుతో కూడుకున్న పని. నేను షేర్ చేసిన ఫొటోస్ లో ఎడమ వైపు ఉన్న లుక్ చూసి అలాంటి లుక్ లో కనిపించకూడదు అని బలంగా అనుకున్నా.

ఆడియో వేడుకలో..
అంత బరువుగా ఉండడం నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఆ ఫొటో దిగినప్పుడు నాకు ఇంకా గుర్తుంది. ఒక తమిళ్ సినిమా ఆడియో వేడుక కోసం వెళ్ళినప్పుడు దిగింది. ఆ రోజు డ్రెస్ వేసుకుందామని అనుకున్నప్పుడు ఎందుకో ఒక్కటి కూడా సెట్టవ్వలేదు అనిపించింది. అందుకే లెగ్గిన్ వేసుకొని, షేమ్ గా ఉండకూడదు అని పైన కోర్టు లాంటిది వేసుకున్నా.

ఎలాగైనా బరువు తగ్గాలని
ఆ రోజు నిజంగా నా బరువుపై ఒక బలమైన కోపంతో పాటు నచ్చలేని సిగ్గు కూడా వేసింది. ఎలాగైనా బరువు తగ్గాలని ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఈ విధంగా మారాను అని విద్యుల్లేఖ వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video

పెళ్లి చేసుకోబోతున్న విద్యుల్లేఖ
తమిళ టీవీ నటుడైన మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. ఇటీవల ఆమె పెళ్లి వార్తతో మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆమె గత కొంత కాలంగా ఒక ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ నిపుణుదైన సంజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరి నిశ్చితార్థం కూడా జరిగింది.


Click it and Unblock the Notifications











