Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రియుడి బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించిన నయనతార (ఫోటోలు)
ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. విఘ్నేష్ ప్రియురాలు, ప్రముఖ నటి నయనతార ఈ బర్త్ డే పార్టీ హోస్ట్ చేశారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ పార్టీలో ఈ ప్రేమజంట సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. పోడా పోడి, తానా సెరంత కూటం, నానుమ్ రౌడీదాన్ లాంటి చిత్రాలతో పాపులర్ అయిన విఘ్నేష్ బుధవారం 34వ వడిలోకి అడుగు పెట్టారు.
ఈ బర్త్ డే పార్టీలో బిగిల్ దర్శకుడు అట్లీ కుమార్, అతడి భార్య ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పార్టీలో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, నటుడు-మోడల్ ఆర్తి వెంకటేష్ ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
విఘ్నేష్ శివన్, నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నయనతార కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నందున ఇప్పట్లో వీరు పెళ్లి ఉండక పోవచ్చని అంటున్నారు.
|
విఘ్నేష్ శివన్
విగ్నేష్ మూవీ కెరీర్ విషయానికొస్తే... నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో రాబోయే తమిళ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేశాడు. పరువు హత్యలపై ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్‌లోని పలు ఎపిసోడ్లకు వెట్రిమారన్, గౌతమ్ మీనన్, సుధ కొంగర కూడా దర్శకత్వం వహించారు.
|
విఘ్నేష్ చేస్తున్న సినిమాలు
విఘ్నేష్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ భాగంలో... నటులు అంజలి, కల్కి కోచ్లిన్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు విఘ్నేష్ శివకార్తికేయన్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడానికి సన్నద్ధం అయ్యారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ కోసం ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది. కియారా అద్వానీ, రష్మిక మండన్న ఇందులో లీడ్ రోల్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే, విఘ్నేష్‌తో శివకార్తికేయన్ చిత్రం అక్టోబర్ లేదా నవంబర్ నుండి మొదలు కానుంది.
నయనతార సినిమాకు నిర్మాతగా విఘ్నేష్
నయనతార త్వరలో మిలింద్ రావ్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమాకు కుమిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి 'నెట్రికన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. 'రౌడీ పిక్చర్స్ పతాకం'పై ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్నారు.