విఘ్నేశ్‌ శివన్‌కు అనుకోని అదృష్టం.. సీఎం స్టాలిన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్!

నయనతార భర్త విఘ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయనతార భర్తగానే కాకుండా ఆయన నేనే రౌడీని వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నేరుగా ఆయన తెలుగు సినిమాలు చేయకపోయినా ఆయన చేసిన సినిమాలు కొన్ని తెలుగులో కూడా అనువాదం అయి విడుదలయ్యాయి. నయనతారను వివాహం చేసుకున్న తర్వాత తిరుమలలో వివాదం నేపథ్యంలో వార్తల్లోకి ఎక్కిన ఆయన ఇప్పుడు ఏకంగా ఒక లక్కీ ఛాన్స్ పట్టేశారు. ఆ వివరాల్లోకి వెళితే

 సీఎంను డైరెక్ట్ చేసే అవకాశం

సీఎంను డైరెక్ట్ చేసే అవకాశం

నయనతారను వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టి హనీమూన్ ఎంజాయ్ చేసి వచ్చిన విఘ్నేష్ శివన్ కి అనుకోకుండా ఒక లక్కీ ఛాన్స్ దక్కింది. ఇప్పటివరకు సినిమా హీరో హీరోయిన్లను డైరెక్ట్ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎంను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు ఆ సీఎం మరెవరో కాదు స్టాలిన్. అదేమిటి ప్రతినిత్యం రాజకీయాలతో పాలనా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే స్టాలిన్ ఏదైనా సినిమాలో నటిస్తున్నారా అని అనుమానం మీకు కలగవచ్చు.

చెస్ క్రీడాకారులు

చెస్ క్రీడాకారులు

కానీ ఆయన నటిస్తున్నది సినిమాలో కాదు ఒక చిన్న యాడ్ ఫిలింలో. తమిళనాడులో అంతర్జాతీయ స్థాయి చెస్ ఒలింపియాడ్ జరగబోతోంది. చెన్నైలో జులై 28 నుంచి ఆగ‌స్ట్ 10 వ‌ర‌కు చెస్ ఒలింపియాడ్ పోటీలు జ‌ర‌గ‌నున్న క్రమంలో 186 దేశాల‌కు చెందిన సుమారు 2 వేల మంది చెస్ క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాలిన్ చాలా వాటిని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

చెన్నైలోని ఒక ప్రాంతంలో

చెన్నైలోని ఒక ప్రాంతంలో

ఈ నేపథ్యంలోనే తమిళనాడు విశిష్టత తమ ఆతిథ్యాన్ని రుచి చూపించే విధంగా ఒక షార్ట్ వీడియో చేయాలని భావించి విగ్నేష్ శివన్ ని సంప్రదించారని దీంతో ఇలాంటి అదృష్టం తనకు దక్కడమే గొప్పగా భావించిన విగ్నేష్ శివన్ వెంటనే చేస్తానని ఒప్పుకున్నారు. ఇక ఈ షూట్ కూడా ఈ మధ్యనే చెన్నైలోని ఒక ప్రాంతంలో జరిగిందని సమాచారం. ప్రస్తుతం వీడియో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని అంటున్నారు.

అజిత్ కుమార్ హీరోగా

అజిత్ కుమార్ హీరోగా

ఇక ఈ ఏడాది కాతువాకుల రెండు కాదల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విగ్నేష్ శివన్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రలలో నటించారు. థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే థియేటర్లలో ఎలా ఉన్నా సరే ఓటీటీలో మాత్రం సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతానికి ఆయన ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు కానీ అజిత్ కుమార్ హీరోగా ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అధికారిక ప్రకటన వచ్చే వరకు

అధికారిక ప్రకటన వచ్చే వరకు

ఇప్పటికే ఆయన కథ సిద్ధం చేసి అజిత్ కుమార్ కు వినిపించగా దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం అజిత్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ విషయం ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X