వాలెంటైన్స్ డే స్పెషల్.. ఫుల్‌గా ఎంజాయ్ చేసిన నయన్.. ప్రియుడి ఎమోషనల్ పోస్ట్

సినిమాలతో, తన పర్ఫామెన్స్‌తో నయన తార ఎంత ఫేమస్ అయిందో.. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులతో అంతే ఫేమస్ అయింది. నయన్ జీవితంలో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం.. మళ్లీ ప్రేమలో పడటం సర్వసాధారణమైంది. నయన్ వ్యక్తిగత విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా నయన్ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

 బెడిసికొట్టిన ప్రేమ వ్యవహారాలు..

బెడిసికొట్టిన ప్రేమ వ్యవహారాలు..

నయనతార ఓ పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు ప్రేమలో పడుతూ ఉంటుంది. శింబుతో మొదట ప్రేమాయణం కొనసాగించగా అది మధ్యలోనే ముగిసింది. ప్రభుదేవా వ్యవహారం పెళ్లిపీఠల వరకు వెళ్లి ఆగిపోయింది. ఇలా రెండు సార్లు దెబ్బతిన్న నయన్.. ఇక ప్రేమకు దూరంగా ఉంటుందని అంతా భావించారు.

 దర్శకుడితో ప్రేమలో..

దర్శకుడితో ప్రేమలో..

నేను రౌడీనే అనే చిత్రంతో దర్శకుడు విఘ్నేశ్ శివన్.. నయన్‌కు దగ్గరయ్యాడు. అక్కడి నుంచి వీరి కొత్త ప్రయాణం మొదలైంది. వీరి ప్రయాణం మొదలై దాదాపు ఐదేళ్లు కావొస్తుంది.. ఇప్పటికీ అంతే అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే పెళ్లికి సంబంధించి మాత్రం అడుగు ముందుకు పడటం లేదు.

విడిపోయారంటూ వార్తలు..

మాములుగా నయన్ ఎక్కడికి వెళ్లినా వెంట ప్రియుడు ఉంటాడు.. ఉండాల్సిందే. అయితే ఆ మధ్య జీ సినీ ఫంక్షన్‌లో ఒంటరిగా దర్శనమిచ్చింది. దీంతో వారిద్దరు విడిపోయారని వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. అయితే వెంటనే నయన్ స్పందించి.. అవన్నీ గాలి వార్తలేనని కొట్టిపారేసింది.

నీ అంతులేని ప్రేమతో..

నీ అంతులేని ప్రేమతో..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. నయన్-విఘ్నేశ్ శివన్ బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు విఘ్నేశ్ షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఐదేళ్ల క్యూట్ స్టోరీ.. ఈ ఐదేళ్లు ఎంతో అద్భుతమైన క్షణాలతో నిండిపోయింది.. నీ అంతులేని ప్రేమతో నాకు ప్రతీరోజు వాలెంటైన్స్ డేనే'అంటూ పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X